Gade Srinivasulu : ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులు విజయం..

ఓటమితో కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు కూటమి అభ్యర్థి రఘువర్మ.

Gade Srinivasulu : ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులు విజయం..

Updated On : March 3, 2025 / 11:31 PM IST

Gade Srinivasulu : ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఆయన విజయం సాధించారు. పీఆర్టీయూ అభ్యర్థిగా గెలుపొందిన గాదె శ్రీనివాసులు ఆది నుంచి ఆధిక్యంలో కొనసాగారు. అటు ఓటమితో కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు కూటమి అభ్యర్థి రఘువర్మ.

ఏపీలో ఒక టీచర్ ఎమ్మెల్సీ, రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గాదె శ్రీనివాసులు గెలుపొందారు. రఘువర్మపై ఆయన విజయం సాధించారు.

Also Read : ఒక్క ఛాన్స్ ప్లీజ్.. ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్సీ ఆశావహుల కోలాహలం..

గుంటూరు, కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెలువడుతున్నాయి. టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధిక్యంలో ఉన్నారు. 2లక్షల 41వేల ఓట్లు పోలయ్యాయి. ఆలపాటి రాజా విజయం దాదాపుగా ఖరారైనట్లు చెప్పొచ్చు. ప్రతి రౌండ్ లోనూ 10వేలకు తగ్గకుండా మెజార్టీ వస్తోంది. పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుపై ఆయన ముందంజలో ఉన్నారు.

తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు కట్టలు కట్టటం పూర్తైంది. ఇందులోనూ విజయం తమదేనని టీడీపీ చెబుతోంది.