Former minister Ganta Srinivasa Rao (1)
Ganta Srinivasa Rao Comments CM Jagan : ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మోదీకి మసాజ్ చేయడానికి ఢిల్లీ వెళ్తున్నాడు తప్ప ఏపీకి ఏమి ఉపయోగం లేదని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో జగన్ సర్కార్ 99 శాతం విఫలమయ్యిందని విమర్శించారు. ఈ మూడు నెలల్లో కూడా చేసేది ఏమి లేదన్నారు. పోలవరంతో పాటు ఒక్కటంటే ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టలేదని విమర్శించారు.
జగన్ గాల్లో వచ్చి గాల్లో వెళ్తారని, అయినా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఓ సీఎం కోసం ఏపీలో హెలి పాడ్ నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. జగన్ కు సంబంధించి ఇది ఓ అరుదైన రికార్డ్ అని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో కల్తీ మద్యం వల్ల 35 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారని, వేలాదిమంది చనిపోయారని ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు నిలబడదని తెలిసి సీఐడీ వాళ్ళు వేరే కేసులపై దృష్టి పెట్టారని పేర్కొన్నారు.
Supreme Court : కేంద్ర ప్రభుత్వ ఎలక్టోరల్ బాండ్ల పథకంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జైలు నుంచి వచ్చిన చంద్రబాబు గురుంచి సజ్జల రామకృష్ణారెడ్డి హీనంగా మాట్లాడడం దారుణమన్నారు. ప్రభుత్వ పెద్దలు డాక్టర్ తో వేర్వేరు రిపోర్ట్ లు ఇప్పించారని ఆరోపించారు. జైలులోనే చంద్రబాబు చేస్తాడని వైసీపీ ఎంపీ మాట్లాడుతున్నాడు.. దీన్ని బట్టి వైసీపీ నేతల పరిస్థితి అర్ధం అవుతుందన్నారు. ఇవాళ విశాఖలో ఇంటర్నేషనల్ సదస్సు జగన్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఋషికొండ నిర్మాణలపై ఆక్షలు ఉన్నప్పటికీ పనులు ఆగడం లేదన్నారు.
ఋషికొండ కోసం ప్రజా సంఘాలు పోరాటానికి సిద్ధమైతే పార్టీలో నిర్ణయం తీసుకొని ముందుకెళ్తామని చెప్పారు. టీడీఆర్ అంశానికి సంబంధించి అన్ని అంశాలను స్టడీ చేస్తున్నామని తెలిపారు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి భూములకు కూడా టీడీఆర్ లు ఇచ్చి ప్రభుత్వ సొమ్ము కొట్టేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఏ భూములకు టీడీఆర్ లు ఇస్తున్నారో ఆ స్థలాలు పరిశీలనకూ వెళ్లాలని చూస్తున్నామని తెలిపారు.
చంద్రబాబు రాజమండ్రి నుంచి విజయవాడకు రావడానికి 14 గంటల సమయం పట్టడం చరిత్ర అన్నారు. చంద్రబాబుకు హైదరాబాద్ లో కూడా అదే ఆదరణ లభించిందని తెలిపారు. నిజమైన నాయకుడికి ఘనమైన స్వాగతం లభించిందన్నారు. దీన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని పేర్కొన్నారు.