Supreme Court : కేంద్ర ప్రభుత్వ ఎలక్టోరల్ బాండ్ల పథకంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఒకవేళ ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలని భావిస్తే విరాళాలన్నీ ఎన్నికల సంఘానికి ఇవ్వాలని సూచించింది. వాటిని ఈసీ రాజకీయ పార్టీలకు సమానంగా పంచుతుందని తెలిపింది.

Supreme Court : కేంద్ర ప్రభుత్వ ఎలక్టోరల్ బాండ్ల పథకంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court Key Comments

Updated On : November 2, 2023 / 11:48 AM IST

Supreme Court Key Comments : రాజకీయ పార్టీలకు విరాళాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎలక్టోరల్ బాండ్ల పథకం వివరాలు కొందరికే అందుబాటులో ఉండటంపై ప్రశ్నలు లేవనెత్తింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా దాతలు అందించే విరాళాల వివరాలు సాధారణ ప్రజలకు అందుబాటులో లేవని తెలిపింది.

అయితే బాండ్లు జారీ చేసే అధీకృత బ్యాంక్ ఎస్పీఐ, దర్యాప్తు సంస్థలు మాత్రం విరాళాల వివరాలు పొందే వీలుందని వెల్లడించింది. రాజకీయ పార్టీలకు డబ్బులు అందించడం ద్వారా ఇది ముడుపులకు చట్టబద్ధత కల్పిస్తుందని స్పష్టం చేసింది. ఒకవేళ ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలని భావిస్తే విరాళాలన్నీ ఎన్నికల సంఘానికి ఇవ్వాలని సూచించింది.

Delhi HC : ఆ మహిళా న్యాయమూర్తికి మరణశిక్ష విధించాలంటూ హైకోర్టులో పిటీషన్ .. షాక్ మామూలుగా లేదుగా..

వాటిని ఈసీ రాజకీయ పార్టీలకు సమానంగా పంచుతుందని తెలిపింది. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ పథకం ప్రభుత్వం, దాతల మధ్య క్విడ్ ప్రోకోకు అవకాశం కల్పిస్తుందని వ్యాఖ్యానించింది.