అసలేం జరిగింది : 13ఏళ్ల బాలికపై పెట్రోల్ పోసి నిప్పు

ఆ బాలిక వయసు పదమూడేళ్లు. నిత్యం స్కూల్‌కు వెళ్లడం..స్నేహితులతో కలిసి ఆడుకోవడం దినచర్య. సీన్‌ కట్‌ చేస్తే..ఓ రోజు స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చిన ఆ బాలిక..బహిర్భుమికి

  • Published By: veegamteam ,Published On : January 29, 2020 / 03:21 PM IST
అసలేం జరిగింది : 13ఏళ్ల బాలికపై పెట్రోల్ పోసి నిప్పు

Updated On : January 29, 2020 / 3:21 PM IST

ఆ బాలిక వయసు పదమూడేళ్లు. నిత్యం స్కూల్‌కు వెళ్లడం..స్నేహితులతో కలిసి ఆడుకోవడం దినచర్య. సీన్‌ కట్‌ చేస్తే..ఓ రోజు స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చిన ఆ బాలిక..బహిర్భుమికి

ఆ బాలిక వయసు పదమూడేళ్లు. నిత్యం స్కూల్‌కు వెళ్లడం..స్నేహితులతో కలిసి ఆడుకోవడం దినచర్య. సీన్‌ కట్‌ చేస్తే..ఓ రోజు స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చిన ఆ బాలిక..బహిర్భుమికి వెళ్లింది. ఆ కొద్ది సేపటికే అక్కడి నుంచి కేకలు. ఏం జరిగిందోనంటూ స్థానికులు పరిగెత్తేసరికి జరగరాని ఘోరం జరిగిపోయింది. గుర్తు తెలియని దుండగులు ఆ బాలికపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. మృత్యువుతో పోరాడిన బాలిక చివరకు ప్రాణాలు విడిచింది. ఇంతకీ పెట్రోల్‌ దాడి వెనక మిస్టరీ ఏంటి..?

శ్రీకాకుళం జిల్లా రాజాంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు…పదమూడేళ్ల బాలికపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. పరిస్థితి విషమించి ఆ బాలిక మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాజాంలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో బాధిత బాలిక భువనేశ్వరి ఏడో తరగతి చదువుతుంది. మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్లింది. తిరిగి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇంటికి వచ్చింది. అనంతరం సాయంత్రం తమ నివాసానికి సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశంలోకి బహిర్భూమికి వెళ్లింది.

కొద్దిసేపటి తర్వాత బాలిక కేకలు వినిపించాయి. దీంతో స్థానికులు బాలిక కేకలు వినిపించిన ప్రాంతానికి పరుగెత్తారు. అక్కడ ఆ బాలిక మంటల్లో కాలిపోతుండటం చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే మంటల్ని ఆర్పేశారు. అప్పటికే ఆమె శరీరమంతా కాలిపోయింది. ఆ బాలిక తమ కుమార్తేనని తల్లిదండ్రులు గుర్తించి కన్నీరుమున్నీరవుతూ ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో ఆ బాలిక చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.

మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు దీనిపై అనుమానం వ్యక్తం చేశారు. అదే పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు తరచూ వేధించేవారని ఆరోపించారు. ఆ విషయం పాఠశాల యాజమాన్యానికి తెలిసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సహచర విద్యార్థులే ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు… ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఈ కేసులో సహచర విద్యార్ధులపై ఆరోపణలు వస్తున్న క్రమంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్లు.. తోటి విద్యార్థులే హతమార్చారా..? లేదా పెట్రోల్‌ దాడి వెనక మరేదైనా కారణం ఉందా..? అన్నది మిస్టరీగా మారింది. విచారణ అనంతరం పోలీసులు ఏం తేల్చుతారో చూడాలి.