Gitanjali Case : గీతాంజలి కేసులో ఎవరిని వదిలిపెట్టేది లేదు : గుంటూరు ఎస్పీ తుషార్ డూడీ

Gitanjali Case : కొన్ని ఫేక్ ఐడిలు, కొన్ని ఒరిజినల్ ఐడిలు ఉన్నట్లు గుర్తించామన్నారు. అసభ్యకర పోస్టింగ్స్ పెట్టిన వారిని గుర్తిస్తామని, ఈ కేసులో ఎవరిని వదిలి పెట్టేది లేదని ఎస్పీ తుషార్ డూడీ పేర్కొన్నారు. 

Gitanjali Case : గీతాంజలి కేసులో ఎవరిని వదిలిపెట్టేది లేదు : గుంటూరు ఎస్పీ తుషార్ డూడీ

Guntur SP Press Meet on Geetanjali Incident

Gitanjali Case : సోషల్ మీడియా ట్రోల్స్ కారణంగా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలి అనే 28ఏళ్ల మహిళా ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 7వ తేదీన గీతాంజలి ఆత్మహత్యాయత్నం చేసిందని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ వెల్లడించారు.

Read Also : CM Jagan : గీతాంజలి ఆత్మహత్య.. వారిని వదిలేది లేదని సీఎం జగన్ వార్నింగ్, రూ.20లక్షలు ఎక్స్‌గ్రేషియా

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆత్మహత్యాయత్నం చేసిన గీతాంజలిని వెంటనే జీజీహెచ్‌కు తరలించినట్టు చెప్పారు. రైల్వే పోలీసులు ఎఫ్‌ఐ‌ఆర్ నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు తెలిపారు. రైల్వే పోలీసుల దర్యాప్తులో సోషల్ మీడియా పోస్టింగ్స్ ద్వారా మనస్థాపానికి గురైందని తేలిందన్నారు.

రైల్వే పోలీసులు కేసును తెనాలి వన్‌టౌన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశామని ఎస్పీ తుషార్ డూడీ చెప్పారు. అక్కడ ఎఫ్ఐఆర్ ఆల్టర్ చేశామన్నారు. 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. డిజిటల్ పుట్ ప్రింట్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ చెక్ చేస్తున్నామని, కొన్ని ఫేక్ ఐడిలు, కొన్ని ఒరిజినల్ ఐడీలు ఉన్నట్లు గుర్తించామన్నారు. అసభ్యకర పోస్టింగ్స్ పెట్టిన వారిని గుర్తిస్తామని, ఈ కేసులో ఎవరిని వదిలి పెట్టేది లేదని ఎస్పీ తుషార్ డూడీ పేర్కొన్నారు.

Read Also : CM Jagan : గీతాంజలి ఆత్మహత్య.. వారిని వదిలేది లేదని సీఎం జగన్ వార్నింగ్