CM Jagan : గీతాంజలి ఆత్మహత్య.. వారిని వదిలేది లేదని సీఎం జగన్ వార్నింగ్, రూ.20లక్షలు ఎక్స్‌గ్రేషియా

గీతాంజలి తనకు వచ్చిన ఇంటి పట్టాను మీడియాలో చూపించి మాట్లాడ్డం తప్పా? భగవంతుని ఆశీస్సులు, ప్రజల అండదండలతో మళ్లీ జగనన్న సీఎం అవుతారు

CM Jagan : గీతాంజలి ఆత్మహత్య.. వారిని వదిలేది లేదని సీఎం జగన్ వార్నింగ్, రూ.20లక్షలు ఎక్స్‌గ్రేషియా

CM Jagan On Geethanjali Incident

CM Jagan : తెనాలి యువతి గీతాంజలి ఆత్మహత్య ఘటన పట్ల ఏపీ సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు ముఖ్యమంత్రి జగన్. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు గీతాంజలి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. రూ.20 లక్షలు ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు సీఎం జగన్. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ చట్టం వదిలిపెట్టదని సీఎం జగన్ హెచ్చరించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందంటూ గీతాంజలి ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూపై ప్రతిపక్షాలకు చెందిన కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ గీతాంజలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, #JusticeForGeethanjali పేరుతో ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని నెటిజనులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ హాష్ ట్యాగ్ ట్విటర్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది.

అసభ్యకర మాటలతో వేధించారు..
గీతాంజలి ఘటనపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా స్పందించారు. గీతాంజలి మరణం ప్రతి మహిళా బాధపడే విధంగా ఉందన్నారామె. గీతాంజలి తనకు వచ్చిన ఇంటి పట్టాను మీడియాలో చూపించి మాట్లాడ్డం తప్పా? ఐ-టిడిపి, జనసేన ఆమెను సోషల్ మీడియాలో అసభ్యకర మాటలతో వేధించారు.

రాష్ట్రంలోని మహిళలందరూ దీని మీద స్పందించాలి. లోకేశ్ ఎమ్మెల్యేగా, వార్డు మెంబర్ గా కానీ గెలవలేదు. అతడి మాటలకు విలువలేదు. వాళ్లకు జగనన్నతో పోటీ చేసే దమ్ము ధైర్యం లేదని అర్థం అయిపోయింది. గెలవలేమని భయం పట్టుకుంది. కాబట్టే, ఎవరు దొరికితే వారితో పొత్తులు పెట్టుకుని సీట్లు పంచుకుంటున్నారు. భగవంతుని ఆశీస్సులు, ప్రజల అండదండలతో మళ్లీ జగనన్న సీఎం అవుతారు” అని మంత్రి రోజా అన్నారు. మంత్రి రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Also Read : బీజేపీ కోసం పవన్ కల్యాణ్ మరో త్యాగం.. ఎన్ని సీట్లు వదులుకున్నారంటే.. బీజేపీకి దక్కిన స్థానాలు ఎన్నంటే