Pawan Kalyan : బీజేపీ కోసం పవన్ కల్యాణ్ మరో త్యాగం.. ఎన్ని సీట్లు వదులుకున్నారంటే.. బీజేపీకి దక్కిన స్థానాలు ఎన్నంటే

టీడీపీ జనసేన బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి వచ్చింది. సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు.

Pawan Kalyan : బీజేపీ కోసం పవన్ కల్యాణ్ మరో త్యాగం.. ఎన్ని సీట్లు వదులుకున్నారంటే.. బీజేపీకి దక్కిన స్థానాలు ఎన్నంటే

Pawan Kalyan Sacrifice For Bjp

Pawan Kalyan Sacrifice : టీడీపీ జనసేన బీజేపీ సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి వచ్చింది. ట్విస్ట్ ఏంటంటే.. జనసేన మరోసారి త్యాగానికి సిద్ధమైంది. బీజేపీ కోసం 3 అసెంబ్లీ స్థానాలు వదులుకుంది. అంతకుముందు 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పిన జనసేన.. ఇప్పుడు 21 స్థానాల్లో మాత్రమే బరిలో నిలవనుంది. ఇప్పటికే ఒక లోక్ సభ స్థానాన్ని త్యాగం చేసింది జనసేన.

ప్రస్తుతం 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తోంది. టీడీపీ ఒక అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి ఇచ్చింది. 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుంది బీజేపీ. జనసేన, బీజేపీ కలిపి 31 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాల్లో బరిలో నిలవనున్నాయి. సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు.

ఈ ఉదయం నుంచి కూడా సీట్ల సర్దుబాటు అంశంపై కూటమి నేతలు చర్చలు జరిపారు. ఎనిమిదన్నర గంటల పాటు చంద్రబాబు, పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సుదీర్ఘంగా చర్చించారు. ఈ చర్చల అనంతరం కూటమి నేతల మధ్య సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదిరిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా బీజేపీకి 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాలు ఇచ్చేందుకు మూడు పార్టీలు ఏకాభిప్రాయ నిర్ణయం తీసుకున్నాయి.

అయితే, ముందుగా అనుకున్న ప్రకారం పొత్తులో భాగంగా ఇరు పార్టీలకు(జనసేన, బీజేపీ) 30 స్థానాలు ఇవ్వాలని చంద్రబాబు భావించారు. చర్చల తర్వాత పొత్తులో భాగంగా 31 అసెంబ్లీ స్థానాలు, 8 లోక్ సభ స్థానాలు కేటాయించేందుకు చంద్రబాబు ఒప్పుకున్నారు. ఈ లెక్కన జనసేనకు 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలు మాత్రమే దక్కే ఛాన్స్ ఉంది. బీజేపీ మాత్రం 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయబోతోంది. దీనిపై అధికారిక ప్రకటన విడుదల కాబోతోంది. ఈ లెక్కన జనసేన కొంత త్యాగం చేసింది. 24 అసెంబ్లీ స్థానాలు అని ముందుగా అనుకున్నా.. 3 స్థానాలను పవన్ త్యాగం చేశారు. ముందు నుంచి బీజేపీకి 6 ఎమ్మెల్యే స్థానాలు అని అనుకున్నా.. ఇవాళ్టి చర్చల్లో 10 స్థానాలు కేటాయించారు.

బీజేపీకి డబుల్ డిజిట్ ఉండాల్సిందే, ఏపీలో బీజేపీ బలోపేతం అవ్వాలని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో 6 పార్లమెంట్, రెండు అంకెల్లో అసెంబ్లీ స్థానాలు ఉండాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో 10 అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించారు. పవన్ కల్యాణ్ కూడా తన స్థానాల్లో మూడింటిని బీజేపీకి కేటాయించారు. టీడీపీ కూడా ఒక అదనపు స్థానాన్ని బీజేపీకి కేటాయించింది. కాగా, ఏయే స్థానాల్లో ఏ పార్టీ బరిలోకి దిగుతుందనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Also Read : ఈ రెండు స్థానాల్లో పోటీ చేయనున్న పవన్ కల్యాణ్?

 

పూర్తి వివరాలు..