Kadapa Rama temple: అరుదైన భంగిమలో శ్రీరాముడు.. ముందు కూర్చొని హనుమంతుడు

హనుమంతునికి వేదాలు చెప్తున్నట్లుగా ఉందని వీ రామ బ్రహ్మం అనే కడపలోని యోగి వేమన యూనివర్సిటీ ..

Kadapa Rama temple: అరుదైన భంగిమలో శ్రీరాముడు.. ముందు కూర్చొని హనుమంతుడు

Sriram

Updated On : April 22, 2021 / 12:38 PM IST

Kadapa Rama temple: కడపలో పురాతన రామాలయం పురావస్తు శాఖ వారిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. విజయనగర కాలం నాటి ఆలయానికి సంబంధించిన ఆర్కిటెక్చర్.. అందులో ఉన్న శ్రీరాముని విగ్రహం చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. సాధారణంగా రాముడు అనగానే చేతిలో విల్లు, బాణం ఉంటాయనుకుంటాం.



ఇక్కడ రాముడి చేతిలో ఆయుధాలేమీ లేకుండా కేవలం పద్మాసనం, కుడి చేతిలో చిన్ముద్రతో కనిపిస్తున్నాడు. ఈ చిన్ముద్ర యోగాసన భంగిమలో చేయి గుండెకు దగ్గరగా, అరచేయి మూసి ఉంచడం, బొటనవేలిని చూపుడు వేలికి దగ్గరగా తీసుకురావడం గమనించొచ్చు. ఇక విగ్రహపు ఎడమ చేయి భూమిని టచ్ చేస్తూ.. భూమిస్పర్శ ముద్రతో ఉంది.



రాముడికి ఎడమ వైపున ఉన్న సీతాదేవీ తామర పువ్వు పట్టుకుని చూస్తుండగా లక్ష్మణుడి విల్లు పట్టుకుని, బాణాలతో కుడివైపున నిల్చొని ఉన్నాడు. ఆంజనేయ భగవానుడు శ్రీరామునికి ఎదురుగా కూర్చొని భంగిమను పరిశీలిస్తూ బ్రహ్మ సూత్రలో ఉన్నాడు.

ఈ విగ్రహాలను బట్టి శ్రీరాముడు.. హనుమంతునికి వేదాలు చెప్తున్నట్లుగా ఉందని వీ రామ బ్రహ్మం అనే కడపలోని యోగి వేమన యూనివర్సిటీ డిపార్డ్మెంట్ ఆఫ్ హిస్టరీ అండ్ ఆర్కియోలజీ అకడెమిషయన్ అంటున్నారు.

అనంతపురం జిల్లా సింగనమలలో ఉన్న 500ఏళ్ల నాటి గుడిలో, కాంచీపురం – చెట్పుట్ మార్గంలో తమిళనాడులోని దీర్ఘజల పర్వతం అడుగుభాగంలోని గుడిలోని ఇలా దృశ్యాలే చూడొచ్చు.