YSR పెన్షన్ కానుక : ప్రభుత్వం మాట తప్పుతోందా ? మోసం చేస్తోందా – పవన్

  • Published By: madhu ,Published On : December 16, 2019 / 07:20 AM IST
YSR పెన్షన్ కానుక : ప్రభుత్వం మాట తప్పుతోందా ? మోసం చేస్తోందా – పవన్

Updated On : December 16, 2019 / 7:20 AM IST

వైసీపీ ప్రభుత్వంపై విమర్శల దాడి ఎక్కుపెడుతున్నారు జనసేనానీ. ఇప్పటికే పలు ప్రదర్శనలు, ర్యాలీలు, దీక్ష చేసిన పవన్..ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు కురిపిస్తున్నారు. YSR పెన్షన్ కానుకలో జగన్ ప్రభుత్వం మాట తప్పుతోందని అనాలా ? లేక మోసం చేస్తోందా అనుకోవాలా అంటూ ప్రశ్నించారు జనసేనానీ చీఫ్ పవన్ కళ్యాణ్. 2019, డిసెంబర్ 16వ తేదీ సోమవారం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. 

అధికారంలోకి రాకముందు : – 
వైసీపీ ఎన్నికల హామీ – వృద్ధాప్య పెన్షన్ రూ. 2 వేల నుంచి రూ. 3 వేలు పెంచుతాం.
వృద్ధాప్య పెన్షన్ పొందే అర్హతను 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తాం. 

Read More : వెనక్కి నడిచిన బాబు..టీడీపీ నేతలు : రివర్స్ టెండరింగ్‌పై టీడీపీ నిరసన

అధికారంలోకి వచ్చాక : – 
* పెన్షన్ రూ. 3 వేలు చేయలేదు. రూ. 2 వేల 250 మాత్రమే చేశారు. ఒక్కో ఫించన్ లబ్దిదారుడు రూ. 750 నష్టపోతున్నారు. 
* పెన్షన్ పొందే..వయస్సు 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తున్నామని మే 30వ తేదీన ఇచ్చిన జీవో ఎం.ఎస్ నెంబర్ 103 ద్వారా చెప్పారు. 
* ఈ విధంగా తగ్గించడం వల్ల దాదాపు కొత్తగా మరో 10 లక్షల మందికి పెన్షన్ దక్కాలి. 

* కానీ ఈ రోజు వరకు ఒక్క కొత్త ఫించన్ లబ్దిదారుడికీ ఒక్క రూపాయి దక్కలేదు. 
* వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న రూ. 2 వేల 250 లెక్కనే చూసుకున్నా..ఒక్కో కొత్త ఫించన్ లబ్దిదారు కుటుంబం ఈ 7 నెలల్లో రూ. 15 వేల 700 కోల్పోయింది. 
* ఓటు వేసినందుకు ఒక్కో కొత్త వృద్ధాప్య ఫించన్ లబ్దిదారు కుటుంబం ఈ 7 నెలల్లో కోల్పోయింది అక్షరాల రూ. 15 వేల 700’ అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. 

మరి ఈ ట్వీట్‌పై వైసీపీ ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.