Gorantla Butchaiah Chowdary : జూ.ఎన్టీఆర్, బాలకృష్ణ, లోకేశ్ మాత్రమే కాదు..కొత్త నాయకత్వం రాబోతోంది!

పార్టీలో పెను మార్పులు చోటు చేసుకబోతున్నాయంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Gorantla Butchaiah Chowdary : జూ.ఎన్టీఆర్, బాలకృష్ణ, లోకేశ్ మాత్రమే కాదు..కొత్త నాయకత్వం రాబోతోంది!

Ap Tdp

Updated On : March 29, 2021 / 7:45 PM IST

AP TDP : ఏపీ టీడీపీ పార్టీలో పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయా ? కీలకంగా ఉన్న కొంతమంది ఆ పార్టీలోకి వస్తారా ? మరలా టీడీపీ పునర్ వైభవం సంపాదించుకబోతోందా ? అంటే టీడీపీ ఎమ్మెల్యే గోరంట బుచ్చయ్య చౌదరి ఎస్ అంటున్నారు. టీడీపీలో ఎంతోమంది వస్తారు..రాబోతున్నారు..పార్టీలో పెను మార్పులు చోటు చేసుకబోతున్నాయంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జూ.ఎన్టీఆర్, బాలకృష్ణ, లోకేశ్ కాకుండా..అన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాలు నుంచి కొత్త నాయకత్వం రాబోతోందన్నారు.

2021, మార్చి 29వ తేదీ సోమవారం రాజమండ్రి కోటేపల్లి బస్టాండు వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి మీడియాతో మాట్లాడారు. గత 40 సంవత్సరాలుగా పార్టీ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొందని చెప్పారు. గ్రౌండ్ రియాల్టీలో కొత్త నాయకత్వం రాబోతోందని, ఏ ఒక్కరు రావాలి..పోవాలి..అని కాకుండా…ఎవరికి వాళ్లే వచ్చి పార్టీని బలోపేతం చేయాలని బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు.

ఇక అమరావతిలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలు, నేతలతో మాట్లాడారు. అభివృద్ధిలో ఏపీ వెనుకబడిందనడానికి సీఎం కేసీఆర్ మాటలే నిదర్శనమన్నారు. గతంలో ఏపీలో ఎకరం భూమి అమ్మితే..తెలంగాణ రాష్ట్రంలో మూడెకరాలు కొనేవాళ్లని వ్యాఖ్యానించారు. కానీ ప్రస్తుతం పరిస్థితి తలకిందులైందని సీఎం కేసీఆర్ మాట్లాడరని ఈ విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. తాజాగా..బుచ్చయ్య చౌదరి చేసిన కామెంట్స్ పై ఎలాంటి స్పందనలు వ్యక్తమౌతాయో చూడాలి.

Read More : Risk of Covid-19 infection : వ్యాక్సిన్ వేయించుకున్నా మీకు కరోనా రావచ్చు.. జాగ్రత్త!