Pawan Kalyan: రూటు మార్చిన జనసేనాని.. టీడీపీ, వైసీపీకి ధీటుగా స్ట్రాంగ్ ఫోర్స్‌గా రెడీ అయ్యే స్కెచ్..!

2029 ఎన్నికల నాటికి ఏపీలో మూడో అతి పెద్ద పొలిటికల్ ఫోర్స్‌గా నిలబడాలనేది పవన్ వ్యూహమని అంటున్నారు. (Pawan Kalyan)

Pawan Kalyan: ఒక్క సీటుతో చట్టసభల్లోకి అడుగుపెట్టారు. ఏకంగా 21 సీట్లతో కింగ్‌ మేకర్ అయ్యారు. ఈ ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం, పాలనపైనే దృష్టిపెట్టారు. కానీ ఇప్పుడు జనసేనాని రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. పార్టీ పటిష్టత కోసం..గ్రౌండ్‌ లెవల్‌ క్యాడర్‌ బలోపేతం ప్లాన్ చేస్తున్నారు సేనాని. మరింత బలపడి టీడీపీ, వైసీపీతో సమానంగా స్ట్రాంగ్ ఫోర్స్‌గా మారాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే సాగర తీరంలో జనసేన పెట్టిన త్రీడేస్‌ పొలిటికల్‌ సమ్మిట్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. పవన్ ఫ్యూచర్‌ ప్లాన్‌ క్లియర్‌ కట్‌గా ఉందా? త్వరలో పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయా?

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం. ఇలా రెండు పదవుల్లో ఉన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్..ఇప్పటివరకు ఒక ఇక నుంచి మరో ఎత్తు అంటున్నారు. 2014లో పార్టీ పెట్టి..2019 ఎన్నికల్లో ఒక్క సీటును మాత్రమే గెలుచుకుని..2024కు వచ్చే సరికి ఏపీ పాలిటిక్స్‌లో గేమ్‌ఛేంజర్‌గా మారారు పవన్. ఈ పదేళ్ల కాలంలో గ్రౌండ్‌ లెవల్‌లో పార్టీ బలోపేతంపై పవన్‌ పెద్దగా ఫోకస్ పెట్టలేదు. తనకున్న హీరో ఇమేజ్‌..అధికార పార్టీ తప్పులను అస్త్రంగా మల్చుకుని..ప్రశ్నించడమే ఎజెండాగా పెట్టుకుని గత ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించారు.

జనసేనను కూడా అదే స్థాయిలో పటిష్టం చేయాలని వ్యూహం..

కానీ లాంగ్‌ టర్మ్‌లో పార్టీ నడవాలంటే గ్రామాల్లో, మండలాల్లో పార్టీ పటిష్టంగా ఉండటం అవసరం. అందుకు ఎగ్జాంపుల్ టీడీపీనే. ఓడినా, గెలిచినా ఆ పార్టీకంటూ ఓ క్యాడర్, లీడర్ ఉంటుంది. అందుకే ప్రాంతీయ పార్టీగా పుట్టి ఇన్నాళ్లు ఎన్నో ఎత్తుపల్లాలు చూస్తూ రాజకీయాల్లో నిలదొక్కుకుంటూ వస్తోంది టీడీపీ. సో ఇప్పుడు జనసేనను కూడా అదే స్థాయిలో పటిష్టం చేయాలనేది పవన్ వ్యూహమంటున్నారు. ఇప్పుడు విశాఖ కేంద్రంగా మూడ్రోజులు పాటు నిర్వహిస్తున్న మీటింగ్‌లు అందుకేనంటున్నారు.

అలా చేస్తే.. జనసేన మరింత బలమైన శక్తిగా ఎదగడం ఖాయం..!

ఇంతకాలం పార్టీ బలోపేతంపై పెద్దగా ఫోకస్ చేయని పవన్‌.. ఇప్పుడు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి దాకా గట్టిగా నిర్మించాలని డిసైడ్ అయ్యారట. పవర్‌లో ఉన్నాం కాబట్టి..పార్టీని స్ట్రెంథెన్‌ చేసేందుకు ఇదే సరైన టైమ్ అని భావిస్తున్నారట. పవన్‌ కోసం పనిచేస్తున్న లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. పార్టీకి క్యాడర్ ఉంది. ఈ రెండింటినీ కో ఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే జనసేన మరింత బలమైన శక్తిగా ఎదగడం ఖాయమన్నది సేనాని వ్యూహమట. అందుకు మూడు రోజుల పాటు జరుగుతున్న జనసేన విస్తృత స్థాయి సమావేశాలు ఒక మంచి వేదిక అని అంటున్నారు. (Pawan Kalyan)

అంతే కాదు జనసేన నుంచి గెలిచిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో పవన్ సమావేశం అవుతారని అంటున్నారు. వారితో మాట్లాడి గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితులు ఏంటనే దానిపై వివరాలు అడిగి తెలుసుకుని భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండాలనేదానిపై ఓ రోడ్‌ మ్యాప్ రూపొందిస్తారని చెప్పుకొస్తున్నారు.

ఏపీ రాజకీయాల్లో అయితే టీడీపీ లేకపోతే వైసీపీ అన్నట్లుగా పరిస్థితి ఉంది. అయితే ఏపీలో థర్డ్ ఫోర్స్‌గా జనసేన దూసుకుని రావడానికి ఇది సరైన సమయమని అంటున్నారు. టీడీపీ అధికారంలో ఉంది. బలమైన క్యాడర్ గ్రౌండ్‌ లెవల్‌ వరకు ఉంది. ఇక వైసీపీ విపక్షంలో ఉంది. ఓటమి నుంచి ఇంకా తేరుకోలేకపోతోంది. దాంతో ఆ పార్టీ క్యాడర్‌, లీడర్లలో ఉన్న స్తబ్దతను తమ పార్టీ ఎదుగుదలకు అనువుగా మార్చుకోవాలని జనసేన చూస్తోందట.

ఏపీలో మూడో అతి పెద్ద పొలిటికల్ ఫోర్స్‌గా నిలబడాలనే స్కెచ్..
2029 ఎన్నికల నాటికి ఏపీలో మూడో అతి పెద్ద పొలిటికల్ ఫోర్స్‌గా నిలబడాలనేది పవన్ వ్యూహమని అంటున్నారు. అంతకంటే ముందు 2026లో జరిగే లోకల్ బాడీ ఎన్నికల్లో తన సత్తాను చాటితే..వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం ఈజీ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. అందుకు ఇదే సరైన టైమ్ అని ఉత్తరాంధ్ర వేదికగా సాగరతీరంలో పార్టీ సమావేశాలను నిర్వహిస్తున్నారట.

ఉత్తరాంధ్రలో టీడీపీ బలంగా ఉంది. చేరికలతో ఉత్తరాంధ్ర టీడీపీ ఓవర్ లోడ్ అయింది. దాంతో వైసీపీ నాయకులు ఎవరైనా టీడీపీలో వెళ్ళేందుకు ప్రయత్నం చేసినా చేర్చుకునే ఛాన్స్ అయితే పెద్దగా లేదని అంటున్నారు. దీంతో వైసీపీ వీక్ అయిన చోట తాము ఆల్టర్నేట్‌గా బలపడాలని చూస్తోందట జనసేన. (Pawan Kalyan)

ఇక వైసీపీ నేతలు కూడా టీడీపీలో చేరేందుకు పెద్దగా ఇష్టపడరు. ఒకవేళ సైకిల్ పార్టీ గూటికి వెళ్దామని అనుకున్నా చేర్చుకునే పరిస్థితి కూడా లేదంటున్నారు. దీంతో జనసేనలో చేరితే భవిష్యత్‌లో తమకు అవకాశాలు వస్తాయని ఆలోచిస్తున్నారట ఫ్యాన్ పార్టీ లీడర్లు. దాంతో జనసేన త్రీడేస్‌ మీటింగ్‌పై ఆసక్తి అయితే పెరుగుతోంది. పవన్ వ్యూహాలు ఎంత వరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

Also Read: డబ్బులుంటే ఇష్టం వచ్చినట్లు చేస్తారా? అంటూ రఘురామ కృష్ణంరాజుపై ఏపీ శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు ఘాటు వ్యాఖ్యలు.