Nellore Janasena Clashes : వినోద్ వర్సెస్ మనుక్రాంత్.. నెల్లూరు జనసేనలో భగ్గుమన్న విభేదాలు
నెల్లూరు జిల్లా జనసేనలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. నెల్లూరు సిటీ ఇంచార్జ్ కేతంరెడ్డి వినోద్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ప్రకటన చేశారు జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ చర్యలు తీసుకున్నారు. అయితే, తనను సస్పెండ్ చేసే అధికారం జిల్లా అధ్యక్షుడికి లేదన్నారు వినోద్ రెడ్డి.

Nellore Janasena Clashes : నెల్లూరు జిల్లా జనసేనలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. నెల్లూరు సిటీ ఇంచార్జ్ కేతంరెడ్డి వినోద్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ప్రకటన చేశారు జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ చర్యలు తీసుకున్నారు. అయితే, తనను సస్పెండ్ చేసే అధికారం జిల్లా అధ్యక్షుడికి లేదన్నారు వినోద్ రెడ్డి.
సిటీలో సుమారు 275 రోజులుగా పవన్ అన్న ప్రజాబాట పేరుతో ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తున్నట్టు చెప్పారు కేతంరెడ్డి వినోద్ రెడ్డి. ఇటీవలే సిటీ నియోజకవర్గంలో గడపగడపకు కార్యక్రమం నిర్వహించారు మనుక్రాంత్ రెడ్డి. అయితే వినోద్ రెడ్డి, మనుక్రాంత్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read..Pawan Kalyan : పోలీసుల మీద చెయ్యి వెయ్యకూడదు.. ఇప్పటం ఇష్యూ గురించి చెప్పిన పవన్
నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ ప్రభావం కొంత కనిపించే నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఒక సిటీ నియోజకవర్గం అని చెప్పాలి. మొదటి నుంచి కూడా ఇక్కడ కేతంరెడ్డి వినోద్ రెడ్డి జనసేనకు ముఖ్య నాయకుడిగా ఉన్నాడు. జనసేన పార్టీ నెల్లూరు జిల్లాలో ఉందంటే కేతంరెడ్డి వల్లే అని ఆ పార్టీ కార్యకర్తలు చెబుతారు. ముందు నుంచి కూడా కేతంరెడ్డి జనసేన పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్లాడు. నెల్లూరులో జనసేన పార్టీ ఉనికిని చాటాడు.
అయితే సిటీ నియోజకవర్గంలో ఈ మధ్య జనసేనలో ముగ్గురు నాయకులు తయారయ్యారు. కేతంరెడ్డితో పాటు మనుక్రాంత్ రెడ్డి, కిషోర్ మూడు గ్రూపులుగా విడిపోయారు. పోటాపోటీగా ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే, కేతంరెడ్డి గత 275 రోజులుగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పవనన్న ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా అయితే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తుందో అదే విధంగా పవనన్న ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు కేతంరెడ్డి.
ఇదే క్రమంలో మూడు రోజుల క్రితం మనుక్రాంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగారు. జనం కోసం జనసేన పేరుతో కార్యక్రమాలు చేపట్టారు. తాము జనంలోకి వెళ్లి ఇంటింటికి తిరుగుతూ పవన్ స్టిక్కర్లు అతికించామని, అయితే మనుక్రాంత్ రెడ్డి వర్గీయులు కూడా అదే స్టిక్కర్ల పై మళ్లీ స్టిక్కర్లు అంటించడం కరెక్ట్ కాదంటున్నారు కేతంరెడ్డి. దీంతో ఈ వ్యవహారంలో ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఇరు వర్గీయులు ఘర్షణకు దిగారు. దీంతో మ్యాటర్ సీరియస్ అయ్యింది. నెల్లూరు జనసేనలో నేతల మధ్య గ్రూపు తగాదాలు భగ్గుమన్నాయి.