Michaung Cyclone : మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు.. లోకేష్ యువగళం పాదయాత్రకి 3 రోజులు తాత్కాలిక విరామం

నెల్లూరు జిల్లాను మిచాంగ్ తుఫాన్ వణికిస్తోంది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. తిరుమలలో ఆదివారం ఉదయం 8 గంటల నుండి సోమవారం ఉదయం 8 గంటల వరకు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.

Rains

Michaung Cyclone – Heavy Rains : మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు, కృష్ణా, ఎన్ టీఆర్, తిరుపతి, శ్రీకాకుళం, శ్రీకాకుళం, కాకినాడతోపాటు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. తుఫాన్ కారణంగా లోకేష్ యువగళం పాదయాత్రకి మూడు రోజుల పాటు తాత్కాలిక విరామం ప్రకటించారు. తుపాను కారణంగా రెడ్ అలర్ట్ ఇచ్చినందున పాదయాత్రకు మూడు రోజుల పాటు విరామం ఇచ్చారు.

నెల్లూరు జిల్లాను వణికిస్తోన్న తుఫాన్
నెల్లూరు జిల్లాను మిచాంగ్ తుఫాన్ వణికిస్తోంది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. నెల్లూరు రూరల్ 169 మిల్లీ మీటర్లు, నెల్లూరు నగరంలో 139 మిల్లీ మీటర్లు అత్యధికంగా వర్షపాతం నమోదైంది. పలుచోట్ల రోడ్లు జలమయం అయ్యాయి. రామలింగాపురం, మాగుంట లేఔట్, ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జిల వద్ద భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Michaung Cyclone : ఏపీకి మిచాంగ్ తుఫాన్ ముప్పు.. భారీ నుంచి అతి భారీ వర్షాలు

లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వైఎస్సార్ నగర్, ఆర్టీసీ కాలనీ నీట మునిగాయి. వాగులు , వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నాయుడుపేట – వెంకటగిరి మధ్య రాకపోకలు స్తంభించాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. మైపాడు, కొత్తకోడూరు, తుమ్మలపెంట, తూపిలి పాలెం వద్ద సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తుమ్మలపెంట వద్ద సముద్రం ముందుకొచ్చింది.

కృష్ణపట్నం పోర్టులో 7వ నెంబర్ ప్రమాద హెచ్చరిక
కృష్ణపట్నం పోర్టులో 7వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాకు మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపించారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు సూచించారు.

Training Aircraft Crashes : తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి రావెల్లి శివారులో కూలిన శిక్షణ హెలికాప్టర్

తిరుపతి జిల్లాలో వర్షాలు
మిచౌoగ్ తుఫాన్ ప్రభావంతో తిరుపతి జిల్లాలోని గూడూరు నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాకాడు స్వర్ణముఖి బ్యారేజ్ కు భారీగా వరద నీరు చేరుతోంది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చిల్లకూరు మండలంలో ఉప్పుటేరు వాగు పొంగి ప్రవహిస్తుండడంతో తిప్పగుంటపాలెంకు రాకపోకలు అంతరాయం ఏర్పడింది.

తిరుమలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. నిన్న ఉదయం 8 గంటల నుండి ఈరోజు ఉదయం 8 గంటల వరకు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. గోగర్భం, పాపవినాశనం, డ్యాములకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పాపవినాశనం డ్యాం 693.6 మీటర్లు, గోగర్భం డ్యాంలో నీటి మట్టం 22.87 అడుగులకు చేరుకుంది.

Passenger Burnt Alive : నల్లగొండ జిల్లాలో ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రయాణికుడు సజీవ దహనం

కృష్ణా, ఎన్ టీఆర్ జిల్లాల్లో మారిన వాతావరణం
కృష్ణా, ఎన్ టీఆర్ జిల్లాల్లో వాతావరణం మారింది. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో వర్షం మొదలైంది. చల్లటి ఈదురు గాలులు బలంగా వీస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అయింది. కృష్ణా జిల్లాలో పాఠశాలలకు విద్యాశాఖ సెలవు మంజూరు చేసింది. మిచాంగ్ తుఫాను కారణంగా గన్నవరం విమానాశ్రయం నుండి హైద్రాబాద్, బెంగుళూరు, తిరుపతి, కడప, వెళ్లాల్సిన పలు ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. అమరావతిపై మిచాంగ్ తుఫాన్ ప్రభావం పడింది. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో తేలికపాటి వర్షం మొదలైంది.

లోకేష్ యువగళం పాదయాత్రకి తాత్కాలిక విరామం
కాకినాడ జిల్లా పిఠాపురంలో లోకేష్ యువగళం పాదయాత్రకి తుఫాన్ కారణంగా మూడు రోజుల పాటు తాత్కాలిక విరామం ప్రకటించారు. తుఫాన్ కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించడంతో పాదయాత్రకు 3రోజుల పాటు విరామం ఇచ్చారు. రెడ్ అలెర్ట్ తొలగించిన తర్వాత యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది.

Telangana Election Results : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 10మంది మహిళలు.. కాంగ్రెస్ నుంచి ఆరుగురు, బీఆర్ఎస్ నుంచి నలుగురు

ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి తీరంలో పొన్నాడ శీలంవారిపాకల వద్ద యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. తుఫాను కారణంగా ఈదురుగాలులతో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. తుఫాన్ ప్రభావం తగ్గాక డిసెంబర్ 7న తిరిగి శీలంవారి పాకల నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభం కానుంది.

ట్రెండింగ్ వార్తలు