AP Local Body Elections : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు.. 34శాతం బీసీ రిజర్వేషన్లపై కీలక ఆదేశాలు!
AP Local Body Elections : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లోగా ప్రారంభించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
Andhra Pradesh local body elections
AP Local Body Elections : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లోగా ప్రారంభించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. మరోవైపు.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టు డిస్మిస్ చేసింది. 105, 1065 జీఓలు రెండింటిని కొట్టివేసింది. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా జీఓలు ఇచ్చారని న్యాయస్థానం పేర్కొంది. మరోవైపు.. సర్ ప్రక్రియ ముగిశాకే ఎన్నికలు జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టి వేసింది. హైకోర్టు తాజా తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తోంది. ఆరు వారాల్లో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వంకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
