విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాదానికి కారణం శానిటైజరేనా?

విజయవాడలో కరోనా సెంటర్ గా వినియోగిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాదం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో 11మంది చనిపోవడం తీరని విషాదం నింపింది. అసలు స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాదం ఎలా సంభవించింది? కారణాలు ఏంటి? అనే విషయాల్లోకి వెళితే, శానిటైజరే కొంప ముంచింది అనే సమాధానం వస్తోంది. అతిగా శానిటైజ్ చేయడం వల్లే తీవ్రత పెరిగిందనే జవాబు వస్తోంది.
కొవిడ్ సెంటర్ గా మారిన స్వర్ణ ప్యాలెస్ లో అతి జాగ్రత్త చర్యలే 11మంది ప్రాణాల మీదకు తెచ్చాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని చెబుతున్నా, కరోనా వైరస్ కారణంగా శానిటైజర్ అతిగా స్ప్రే చేయడం వల్లనే మంటలు వేగంగా వ్యాపించాయని తెలుస్తోంది. శానిటైజర్ లో వాడే కెమికల్స్ లో మండే స్వభావం ఉండటంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగిందనే అనుమానాలు లేకపోలేదు.
షార్ట్ సర్క్యూట్ కి తోడు అతిగా శానిటైజర్ స్ప్రే చేయడం వల్లే ఈ పెను విషాదం జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హోటల్ లోని ప్రతి చోట చివరకు కంప్యూటర్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులపైనా శానిటైజర్ స్ప్రే చేయడం వల్లే ఇంత దారుణం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
* స్వర్ణ ప్యాలెస్ లో శానిటైజరే కొంపముంచిందా?
* కరోనా వైరస్ భయంతో హోటల్ లో అతిగా శానిటైజ్ చేసిన స్టాఫ్
* అతిగా శానిటైజ్ స్ప్రే చేయడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగింది
* ఎలక్ట్రానిక్ పరికరాలపైనా శానిటైజర్ చల్లిన సిబ్బంది
* షార్ట్ సర్క్యూట్ వల్ల హోటల్ లో రాజుకున్న మంటలు
* శానిటైజర్ వాడటంతో ఎక్కువైన మంటల వ్యాప్తి
* దట్టమైన పొగతో హోటల్ అంతా వ్యాపించిన మంటలు
* పొగతో ఊపిరాడక 11మంది బాధితులు మృతి