Raavi Venkateswara Rao : గుడివాడలో హైటెన్షన్.. టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై పెట్రోల్ దాడి
గుడివాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకి ఫోన్ చేసి కొందరు వ్యక్తులు బెదిరించారు. మీడియాతో మాట్లాడుతుండగా పెట్రోల్ సంచులతో టీడీపీ నేతలపై దాడికి యత్నించారు.

Raavi Venkateswara Rao : గుడివాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకి ఫోన్ చేసి కొందరు వ్యక్తులు బెదిరించారు. మీడియాతో మాట్లాడుతుండగా పెట్రోల్ సంచులతో టీడీపీ నేతలపై దాడికి యత్నించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
టీడీపీ నేతలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. తర్వాత కొందరు యువకులతో టీడీపీ ఆఫీసుకి వచ్చిన వ్యక్తి.. అసభ్యపదజాలంతో టీడీపీ నేతలను దూషించాడు. ఆ గ్యాంగ్ ను కూడా పోలీసులు అడ్డుకున్నారు. వీరిని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై ఆ గ్యాంగ్ దాడి చేసింది.
రాజకీయంగా చాలా కాలంగా గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, టీడీపీ ఇంచార్జ్ గా ఉన్న రావి వెంకటేశ్వరరావు వర్గాల మధ్య గత కొంతకాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి. 2019 నుంచి కూడా ఈ ఘర్షణలు జరుగుతున్నాయి. ఇప్పుడు తార స్థాయికి చేరాయి. అమరావతి రాజధాని రైతుల పాదయాత్ర సమయంలోనూ ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.
ఆదివారం సాయంత్రం సడెన్ గా కొడాలి నాని అనుచరులు భారీ ఎత్తున టీడీపీ నేతలపై దాడికి ప్రయత్నించారని చెబుతున్నారు. రేపు వంగవీటి మోహన రంగా వర్ధంతి సమావేశానికి టీడీపీ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే, మీకా అర్హత లేదంటూ కొడాలి నాని అనుచరులు తమపై దాడులకు ప్రయత్నించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో గుడివాడలో ఒకరకమైన ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది.
Also Read..Macherla High Tension : ఛలో మాచర్లకు టీడీపీ పిలుపు..ఎక్కడిక్కడ టీడీపీ నేతలు హౌస్ అరెస్ట్
ఇటీవలే మాచర్లలో సైతం ఇలాంటి ఘర్షణ వాతావరణం కనిపించింది. అక్కడ కూడా వైసీపీ శ్రేణులు ఇదే రకమైన ఘర్షణ వాతావరణం సృష్టించారని టీడీపీ నేతలు ఆరోపించారు. అదే స్థాయిలో ఇప్పుడు గుడివాడలోనూ వైసీపీ నేతలు ఘర్షణ చేయడానికి, టీడీపీ నేతలపై దాడులకు ప్రయత్నించారని టీడీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ నేతలపై దాడి విషయం తెలుసుకుని పెద్ద సంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు పార్టీ ఆఫీస్ కి చేరుకున్నారు.
కొడాలి నాని ముఖ్య అనుచరుడు కాలీ అనే వ్యక్తి రావి వెంకటేశ్వరరావుకి ఫోన్ చేసి చంపుతానని బెదిరించాడని టీడీపీ నేతలు ఆరోపించారు. అసభ్య పదజాలంతో దూషించారని, అంతేకాకుండా పెట్రోల్ సంచులతో దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులపైనా దాడికి యత్నం జరిగింది. వైసీపీ నేతల దాడిని టీడీపీ నేతలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న పోలీసులు టీడీపీ శ్రేణులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు తప్ప ఘర్షణకు కారకులైన వారిపై చర్యలు తీసుకోలేదని టీడీపీ నేతలు ఆరోపించారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
రావి వెంకటేశ్వరరావుని చంపుతామని గత కొంతకాలంగా ఫోన్ బెదిరింపులకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఘర్షణకు కారణమైన వారిపై చర్యలు తీసుకోని పోలీసులు తమపైనే లాఠీఛార్జ్ చేయడం దారుణం అంటున్నారు టీడీపీ నేతలు.
రేపు వంగవీటి మోహన రంగా వర్ధంతి కార్యక్రమానికి సంబంధించి టీడీపీ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రావి వెంకటేశ్వరరావు కూడా అక్కడే ఉన్నారు. అయితే, రావి వెంకటేశ్వరరావుకి ఫోన్ కాల్స్ వచ్చాయి. చంపుతామని బెదిరించారు. ఈ కార్యక్రమం మీరు చేయడానికి వీల్లేదని ఫోన్ లో బెదిరించారు. అసభ్య పదజాలంతో దూషించారు. అయినా ఏర్పాట్లు ఆపకపోవడంతో.. వైసీపీ గూండాలు.. నేరుగా తమ వద్దకే పెట్రోల్ సంచులతో వచ్చి తమపై దాడికి యత్నించారని టీడీపీ నేతలు తెలిపారు. పోలీసులు అక్కడే ఉన్నా ఏమీ పట్టించుకోలేదని మండిపడ్డారు. అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్న పోలీసులు.. టీడీపీ శ్రేణులను నిలువరించే ప్రయత్నం చేశారే కానీ, ఘర్షణకు కారణమైన వారిపై చర్యలు తీసుకోలేదని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు.