Macherla High Tension : ఛలో మాచర్లకు టీడీపీ పిలుపు..ఎక్కడిక్కడ టీడీపీ నేతలు హౌస్ అరెస్ట్

వైసీపీ, టీడీపీ ఘర్షణలో మాచర్ల నివురుకప్పిన నిప్పులా మారింది. టీడీపీ చేపట్టిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని వైసీపీ కార్యకర్తలు ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు. ఈక్రమంలో టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి మాచర్లలో చేపట్టిన ఈకార్యక్రమం తీవ్ర ఉద్రిక్తలకు దారి తీసింది. దీంతో చంద్రబాబు ఛలో మాచర్లకు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఎక్కడిక్కడ టీడీపీ నేతలు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.

Macherla High Tension : ఛలో మాచర్లకు టీడీపీ పిలుపు..ఎక్కడిక్కడ టీడీపీ నేతలు హౌస్ అరెస్ట్

Macherla High Tension

Macherla High Tension : వైసీపీ, టీడీపీ ఘర్షణలో మాచర్ల నివురుకప్పిన నిప్పులా మారింది. టీడీపీ చేపట్టిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని వైసీపీ కార్యకర్తలు ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు. ఈక్రమంలో టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి మాచర్లలో చేపట్టిన ఈకార్యక్రమం తీవ్ర ఉద్రిక్తలకు దారి తీసింది. మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ వార్డులో ఇదేం కర్మ కార్యక్రమం చేపట్టారు జూలకంటి బ్రహ్మారెడ్డి. వార్డులో ఇంటింటికి తిరుగుతున్న సమయంలో టీడీపీ శ్రేణులపై రాళ్లు, కర్రలతో వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. టీడీపీ శ్రేణులు సైతం తీవ్రంగా ప్రతిఘటించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడుల్లో పలువురు టీడీపీ, వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. టీడీపీ కార్యాలయానికి వైసీపీ కార్యకర్తలు నిప్పుపెట్టారు.  టీడీపీ, వైసీపీ పరస్పర దాడులతో మాచర్ల పట్టణంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మాచర్లలో పోలీసులు 144 సెక్షన్ విధించారు.

Macherla High Tension : మాచర్లలో భయానకం.. టీడీపీ ఆఫీస్‌కు, వాహనాలకు నిప్పు.. టీడీపీ వైసీపీ నేతల మధ్య తీవ్ర ఘర్షణ

మాచర్లలో జరిగిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఛలో మాచర్లకు పిలుపినిచ్చారు. దీంతో మరింతగా పరిస్థితి తీవ్రతగా దారి తీసింది. టీడీపీ నేతలు మాచర్లకు రావద్దని పోలీసులు హెచ్చరించారు. ఈక్రమంలో టీడీపీ నేతలకు పోలీసులు ఎక్కడిక్కడ హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు టీడీపీ నేతల ఇళ్ల వద్ద గస్తీ కాస్తున్నారు. వారు ఇళ్లనుంచి బయటకు రాకుండా చూస్తున్నారు. దీంట్లో భాగంగా ఇప్పటికే ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనందబాబు, జీవీ ఆంజనేయులు, కోడెల శివరామ్ లను హౌస్ అరెస్ట్ చేశారు. ఎవ్వరు మాచర్ల రావద్దని వస్తే అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

కాగా మాచర్ల ఘటనపై చంద్రాబు, లోకేశ్ తీవ్రంగా ఖండించారు. మాచర్ల ఘటనపై గుంటూరు డీఐజీకి టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు ఫోన్ చేశారు. పరిస్థితి దారుణంగా ఉంటే పోలీసులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ రౌడీయిజానికి పోలీసులు కొమ్ముకాయడం దారుణమని ట్వీట్ చేశారు. వైసీపీ గుండాలకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని చంద్రబాబు ట్వీట్ చేశారు. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితికి ఇది అద్దం పడుతుందన్నారు. మరోవైపు మాచర్ల ఘటనను ఖండిస్తూ టీడీపీ నేత నారా లోకేష్ ట్వీట్ చేశారు.

Chandrababu Lokesh Fired YCP : వైసీపీ గుండాలకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని చంద్రబాబు, లోకేష్ ట్వీట్

మాచర్లలో వైసీపీ నేతలకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ రౌడీ మూకలు పోలీసుల సహకారంతో మరోసారి టీడీపీ శ్రేణులపై దాడికి పాల్పడటం దారుణమన్నారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహిస్తున్న టీడీపీ నాయకులపై వైసీపీ రౌడీలు దాడులకు పాల్పడటం రాష్ట్రంలో అరాచక పాలనకు నిదర్శనమన్నారు. దాడి చేసిన వైసీపీ గుండాలను వదిలేసి పోలీసులు టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జీ చేయడం దారుణమని లోకేష్ అన్నారు.