Ap Inter Results 2025: ఇంటర్ రిజల్ట్స్ ఎక్కడెక్కడ చెక్ చేసుకోవచ్చు.. వెబ్ సైట్ల వివరాలు..

విద్యార్థులు తమ స్కోర్‌లపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే రీకౌంటింగ్, రీ వేరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Ap Inter Results 2025: ఇంటర్ రిజల్ట్స్ ఎక్కడెక్కడ చెక్ చేసుకోవచ్చు.. వెబ్ సైట్ల వివరాలు..

Updated On : April 11, 2025 / 5:43 PM IST

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పస్ట్, సెకండియర్ పరీక్షా ఫలితాలను విద్యార్థులు పలు వెబ్‌సైట్లలో చూసుకోవచ్చు. విద్యార్థులు వారి ఫలితాలను bie.ap.gov.in , resultsbie.ap.gov.in వంటి అధికారిక వెబ్‌సైట్లలో యాక్సెస్ చేయవచ్చు. అధిక ట్రాఫిక్‌ కారణంగా అవి ఓపెన్‌ కాకపోతే మరిన్ని వెబ్‌సైట్లలోనూ ఫలితాలు చూసుకోవచ్చు.

లేదంటే BIEAP కూడా వాట్సాప్, SMS ద్వారా ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలను చూసుకునే సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. విద్యార్థులు తమ స్కోర్‌లపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే రీకౌంటింగ్, రీ వేరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: వామ్మో.. రూ.110 కోట్ల డీల్‌కి విరాట్‌ కోహ్లీ స్వస్తి.. పెద్ద ప్లానే వేశాడుగా..

AP ఇంటర్ ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోవచ్చు

  • అధికారిక వెబ్‌సైట్‌ resultsbie.ap.gov.in ను ఓపెన్ చేయండి
  • ఇంటర్ 1వ సంవత్సరం లేదా 2వ సంవత్సరం ఫలితాలలో దేనినైనా ఎంచుకోండి ​
  • మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని టైప్ చేయండి
  • మీ మార్కులు, గ్రేడ్‌ను చూసుకోవడానికి సబ్మిట్‌పై క్లిక్ చేయండి

10tv.inలో ఇలా చెక్‌ చేసుకోండి

  • 10tv.in ఓపెన్ చేయండి
  • మీకు కనపడే ఏపీ ఇంటర్‌ ఫలితాల బ్యానర్‌ మీద క్లిక్‌ చేయండి
  • ఫలితాల పేజీ ఓపెన్ అవుతుంది
  • నాలుగు ఆప్షన్లు వస్తాయి
  • ఇంటర్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్స్‌, వొకేషనల్ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్స్‌ ఆప్షన్లు వస్తాయి
  • పైవాటిలో మీకు ఏ ఫలితాలు కావాలో దానిపై క్లిక్ చేయండి
  • హాల్ టికెట్ నంబరు ఎంటర్ చేయండి
  • సబ్మిట్ కొట్టండి
  • మార్క్స్‌ మెమో వస్తుంది