Visakha Shipyard
Visakha Shipyard Jobs : విశాఖపట్నంలోని హిందూస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో(HSL) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 53 పోస్టులు భర్తీ చేయనున్నారు. వాటిలో పర్మనెంట్ ప్రాతిపదికన 18 పోస్టులు, తాత్కాలిక ప్రాతిపదికన 31 పోస్టులు, నిర్ధేశిత కాల ఒప్పందం ప్రాతిపదికన 4 పోస్టులు భర్తీ చేయనున్నారు.
పర్మనెంట్ ప్రాతిపదిక భర్తీ చేసే ఉద్యోగాలలో జనరల్ మేనేజర్, అడిషనల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టులు ఉన్నాయి. వీటికి డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్హతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఉద్యోగాలలో డిప్యూటీ చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ మేనేజర్, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. వీటికి ఫుల్‌టైం ఇంజనీరింగ్ డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై టెక్నికల్ అనుభవం కలిగి ఉండాలి.
నిర్ణీత కాల ఒప్పంద ఉద్యోగాలలో సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. పని అనుభవంతో పాటు ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
మొత్తం ఖాళీలు- 53
పర్మనెంట్ అబ్సార్ప్షన్ పద్ధతిలో భర్తీ చేసే పోస్టులు- 18
జనరల్ మేనేజర్ (హెచ్ఆర్)- 1
అడిషనల్ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్)- 1
డిప్యూటీ జనరల్ మేనేజర్ (టెక్నికల్)- 2
డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్)- 1
సీనియర్ మేనేజర్ (టెక్నికల్)- 4
మేనేజర్ (టెక్నికల్)- 7
మేనేజర్ (ఫైనాన్స్)- 1
డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్)- 1
ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్- 31
డిప్యూటీ చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆగ్యుమెంటేషన్)- 1
డిప్యూటీ చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఎస్ఏపీ బేసిస్ కన్సల్టెంట్)- 1
ప్రాజెక్ట్ మేనేజర్ (ఎస్ఏపీ ఏబీఏపీ డెవలపర్)- 1
డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (షిప్‌రైట్ ట్రేడ్)- 6
డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సబ్‌మెరైన్ టెక్నికల్)- 14
డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఇన్ షిప్స్ టెక్నికల్)- 8
కన్సల్టెంట్ ఆన్ ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్- 4
సీనియర్ కన్సల్టెంట్ (టెక్నికల్)- 1
సీనియర్ కన్సల్టెంట్ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆగ్యుమెంటేషన్)-
సీనియర్ కన్సల్టెంట్ (ఈకేఎం ప్లానింగ్ అండ్ సబ్‌మెరైన్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్)- 1
కన్సల్టెంట్ (ఈకేఎం ప్లానింగ్ అండ్ సబ్‌మెరైన్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్)- 1
వివరాలకు : వెబ్‌సైట్.www.hslvizag.in