yanam : యానాం మత్స్యకారులకు దొరికిన 20కిలోల పండుగప్ప చేప .. పంట పండిందంటున్న గంగపుత్రులు
చేపల్లో రారాజు పండుగప్ప గంగపుత్రుల వలకు చిక్కింది. 20కిలోల భారీ పండుగప్ప చేప వలకు చిక్కటంతో మార్కెట్లో సందడి నెలకొంది. ఈ చేపను దక్కించుకోవటానికి పోటీ పడ్డారు.

pandugappa fish yanam fisharman
pandugappa fish yanam fisharman : గోదావరి తల్లిని నమ్ముకుని ఎంతోమంది మత్స్యకారులు జీవిస్తుంటారు. గంగమ్మ కరుణించి అరుదైన చేప వలకు చిక్కితే వారి పంట పండుతుంది. అలా సముద్రంలో మత్స్యకారులకు ఎంతో అరుదైన చేపలు వలకు చిక్కుతుంటాయి. చేపలు అంటేనే ఔషధాల గని. అటువంటిది ఔషధాల్లో ఉపయోగించే కొన్ని అరుదైన చేపలు వలకు చిక్కితే రాత్రికి రాత్రే లక్షాధికారులు అయిపోతుంటారు గంగపుత్రులు. అటువంటి సందర్భాలు చాలానే జరిగాయి.
తాజాగా కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో మత్స్యకారులకు ఓ భారీ చేప దక్కింది. భారీ బరువైన ‘పండుగప్ప’ చేప మత్స్యకారుల వల చిక్కింది. ఈ చేప చిక్కితే వారికి పండుగే పండుగ. ఎందుకంటే పండుగప్ప చేప ఎంత గొప్పదో గంగపుత్రులకు బాగా తెలుసు. దాని రుచి..మార్కెట్లో దానికున్న డిమాండ్ అలాంటిది.
Blue Ocean Dosa : నీలి సముద్రంలాంటి ‘బ్లూ దోశ’ .. తింటే వన్స్ మోర్ అనాల్సిందేనట..!
యానాం వద్ద స్థానిక మత్స్యకారుల వలకు 20కిలోల పండుగప్ప చేప చిక్కింది. ఉప్పునీటిలో పెరిగే ఈ చేపను సముద్ర చేపల రుచుల్లో రారాజు అంటారు గంగపుత్రులు. ఈ పండుగప్ప చేపకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈక్రమంలో స్థానిక మత్స్యాకారుల వలకు చిక్కిన ఈ భారీ పండుగప్ప చేప మార్కెట్లో రూ.12వేలు ధర పలికింది. దీంతో వారి సంతోషం అంతా ఇంతా కాదు. సాధారణంగా వలలకు పండుగప్ప చేపలు చిక్కుతుంటాయి. కానీ ఇంత భారీ సైజులో పండుగప్ప చేప దొరకటం చాలా అరుదు అని అంటువంటిది ఇంత భారీ చేప తమకు దొరకటం అదృష్టమని మురిసిపోతున్నారు.
పండుగప్పను పులుసు చేసుకుంటే లొట్టలేసుకుంటు తినేస్తారు. అది పచ్చి చేప అయినా ఎండబెట్టి ఉప్పుచేపగా మార్చినా డిమాండ్ బాగా ఉంటుంది. ఈ అరుదైన చేపలు చిక్కితే మత్స్యకారుల సంతోషం అంతా ఇంతా కాదు. గోదావరిలో మత్యకారుల కు దొరికిన పండుగప్ప చేపను ఏషియన్ సీ బాస్ అని అంటారు. అంటే దీని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవాల్సిందే. పండుగప్ప చేపలో మంచి ప్రోటీన్స్ ఉంటాయి. జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో ఈ చేపకు ఎప్పుడు డిమాండ్ ఏమాత్రం తగ్గదు.