Road Accident
Huge Road Accident : రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతుండడంతో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. నిర్లక్ష్యం ఒకటైతే..అతివేగం ప్రమాదాలకు కారణమౌతున్నాయి. నిదానంగా వెళ్లాలని, అధికమందితో ప్రయాణం చేయవద్దని చెబుతున్నా..కొంతమంది ఆ..ఏమతువుతుందిలే..అనుకుంటూ వెళుతున్నారు. వారు చనిపోవడమే కాకుండా…ఇతరులు మృతి చెందుతున్నారు.
Read More : Fitness : జీరోదా బంఫర్ ఆఫర్.. ఇలా చేస్తే నెల జీతం బోనస్
తాజాగా…ఏపీ ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి సంబంధం కుదుర్చుకుని ఎంతో హ్యాపీగా వస్తున్న వారిని రోడ్డు ప్రమాదం కబలించివేసింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. ప్రయాణికులతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం.. ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొట్టింది.
Read More : Srisailam : యాగశాల నిర్మాణానికి శంకుస్థాపన
ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. కంభం వైద్యశాలలో చికిత్స పొందుతూ ఒకరు మృతి. దీంతో మృతుల సంఖ్య ఐదుగురికి చేరింది. తర్లుపాడు మండలం రోలుగుంపాడు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను కంభం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Read More :Cannabis : హైదరాబాద్‌లో రూ.21 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
ఆటోలో 14 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రోడ్డుపై చనిపోయిన గేదెను తప్పించబోయి టిప్పర్‌ను ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. మృతుల్లో డ్రైవర్ సహా ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతులంతా దర్శి ప్రాంతానికి చెందినవారుగా గుర్తించారు. పెళ్లి సంబంధం కుదుర్చుకొని తిరిగి దర్శి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.