Telugu States Bypoll : హుజూరాబాద్, బద్వేల్‌‌లో పోలింగ్ సమాప్తం

గత కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారంతో అదరగొట్టిన నేతల భవితవ్యం ఇప్పుడు ఈవీఎంలలో నిక్షిప్తమైంది.

Huzurabad, Badvel Bypolls : గత కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారంతో అదరగొట్టిన నేతల భవితవ్యం ఇప్పుడు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఎవరు గెలిచారనేది మాత్రం సస్పెన్స్. తెలుగు రాష్ట్రాల్లోని బద్వేల్, హుజూరాబాద్ లలో 2021, అక్టోబర్ 30వ తేదీ శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 7 గంటలకు ముగిసింది. అప్పటి వరకు క్యూ లైన్ లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతినిస్తున్నారు. పలు చోట్ల ఉద్రిక్తతల మధ్యే పోలింగ్ కొనసాగినా… ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోలింగ్ శాతం భారీగా నమోదైంది. బద్వేల్ లో మాత్రం మందకొడిగా నమోదైందని తెలుస్తోంది.

Read More : Rahul Gandhi: బైక్ ట్యాక్సీపై ప్రయాణించిన రాహుల్ గాంధీ

హుజూరాబాద్ ఉఫ ఎన్నిక : –
ఓట్లు వేయడానికి ఓటర్లు క్యూ కట్టారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 45.63 శాతం నమోదయింది. సాయంత్రం అయ్యే వరకు భారీగా ఓటింగ్ నమోదైంది. జూన్ 12న మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయటంతో హుజూరాబాద్ లో బై పోల్‌ జరగుతోంది. ఉప ఎన్నికల్లో మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 306 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈసీ.  శనివారం జరిగిన ఉప ఎన్నికలో భారీగా పోలింగ్‌ సాగింది. గంట గంటకు పోలింగ్ శాతం పెరుగుతూ వచ్చింది.

Read More : UP : విద్యార్థిని తలకిందులుగా వేలాడదీసిన ప్రిన్స్‌‌పాల్ అరెస్టు!

ఉత్సాహం చూపిన ఓటర్లు: –
ఓటేసేందుకు ఓటర్లు ఉత్సాహం చూపించారు. సాయంత్రం 5 గంటల వరకు హుజూరాబాద్ నియోజకవర్గంలో 76.26 శాతం పోలింగ్ నమోదైందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. చెదురుమెదురు ఘటనలు మినహా హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. హుజురాబాద్ నియోజకవర్గ నికి ఇది మూడో ఉప ఎన్నిక. టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్, కాంగ్రెస్‌ అభ్యర్థిగా బల్మూరి వెంకట్‌ బరిలో ఉన్నారు.

Read More : WhatsApp Stop : న‌వంబ‌ర్ 1 నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ ప‌నిచేయ‌దు.. మీ ఫోన్ ఉందో చెక్ చేసుకోండి!

బద్వేల్ ఉప ఎన్నిక : –
2019 ఎన్నికల్లో బద్వేల్ నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణంతో నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. చనిపోయిన ఫ్యామిలీకి ఈ ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వడంతో చనిపోయిన వారి జ్ఞాపకార్థం టీడీపీ, జనసేనలు బద్వేల్ లో పోటీ చెయ్యట్లేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు పోటీలో నిల్చున్నారు. బద్వేల్ లో అధికారపక్ష పార్టీ వైసీపీ అభ్యర్థిగా మరణించిన వెంకటసుబ్బయ్య భార్య సుధను బరిలో దింపింది.

Read More : Badvel By Poll : బద్వేల్‌లో ప్రశాంతంగా ఉపఎన్నిక.. 3 గంటల వరకు 44.82 శాతం పోలింగ్

అక్కడక్కడ వర్షం..చిరుజల్లులు : –
బద్వేల్‌లో మొత్తం 281 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేసింది ఈసీ.2021, అక్టోబర్ 30వ తేదీ శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. కానీ..ఇక్కడ పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. కడప జిల్లా బద్వేల్‌లో ఉప ఎన్నిక పోలింగ్ మందకొడిగా సాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు 59.58 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచి నియోజకవర్గంలో అక్కడక్కడ వర్షం, చిరుజల్లులు పడుతుండటంతో… పోలింగ్‌కు కాస్త అడ్డంకిగా మారింది. సాయంత్రం వేళ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. పోలింగ్ సమయం ముగిసే సమయానికి క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు ఎన్నికల సిబ్బంది ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. మొత్తంగా బద్వేల్, హుజూరాబాద్ లలో ఉప ఎన్నిక పోలింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం నమోదైన ఓటింగ్ శాతం, సరళిని గెలుపు అవకాశాలను నేతలను పరిశీలిస్తున్నారు. నవంబర్ 02వ తేదీన ఫలితం వెలువడనుంది.

ట్రెండింగ్ వార్తలు