UP : విద్యార్థిని తలకిందులుగా వేలాడదీసిన ప్రిన్స్‌‌పాల్ అరెస్టు!

విద్యార్థిడిని బిల్డింగ్ పై నుంచి తలకిందులుగా వేలాడ దీసిన ఘటనపై యూపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ప్రిన్స్ పాల్ పై కేసు నమోదు చేయాలని మీర్జాపూర్ జిల్లా మెజిస్ట్రేట్ ను ఆదేశించింది.

UP : విద్యార్థిని తలకిందులుగా వేలాడదీసిన ప్రిన్స్‌‌పాల్ అరెస్టు!

School

Dangling Child Upside Down : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం.. మీర్జాపూర్ జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్ ప్రిన్స్ పాల్ రెండో తరగతి చదువుతున్న విద్యార్థి పట్ల ప్రవర్తించిన తీరుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. ఆ విద్యార్థిడిని బిల్డింగ్ పై నుంచి తలకిందులుగా వేలాడ దీసిన ఘటనపై యూపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ప్రిన్స్ పాల్ పై కేసు నమోదు చేయాలని మీర్జాపూర్ జిల్లా మెజిస్ట్రేట్ ను ఆదేశించింది. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Read More : PM Modi: కాంగ్రెస్ చేతకానితనమే మోదీ బలం.. – మమతా బెనర్జీ

మీర్జాపూర్ జిల్లాలో అహరౌరలోని సద్బావన శిక్షాన్ సంస్థాన్ జూనియర్ హై స్కూల్ లో ప్రిన్స్ పాల్ గా మనోజ్ విశ్వకర్మ వ్యవహరిస్తున్నారు. రెండో తరగతి చదువుతున్న విద్యార్థి పట్ల దారుణంగా ప్రవర్తించాడు. అల్లరి చేస్తున్నాడనే కారణంతో…పిల్లాడిని స్కూల్ బిల్డింగ్ లోని ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఓ కాలు పట్టుకుని తలకిందులుగా వేలాడదీశాడు. కిందకు వదిలేసే రీతిలో పట్టుకోవడంతో విద్యార్థి భయంతో కేకలు వేశాడు. క్షమించమని కోరిన తర్వాత..అతడిని పైకి లేపాడని తెలుస్తోంది.

Read More : TPT : త్వరలోనే కొండపైకి ఎలక్ట్రిక్ బస్సులు..ప్రారంభించనున్న సీఎం జగన్!

సుమారు పది నిమిషాల పాటు తలకిందులుగా వేలాడదీసినట్లు సమాచారం. పిల్లవాడు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఐపీసీలోని 352 సెక్షన్ కింద కేసు బుక్కైంది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. దీంతో విద్యాశాఖ చర్యలు తీసుకొనేందుకు ఉపక్రమించింది. స్కూల్ గుర్తింపును రద్దు చేసి…అందులో ఉన్న 300 మంది విద్యార్థులను మరో స్కూల్ కు తరలించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.