Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉన్నాయా..? అతనిపై బైక్ ఎలా పడింది..? పోలీసులు ఏం చెప్పారంటే..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు.

IG Ashok kumar
Pastor Praveen Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. హైదరాబాద్ నుంచి పాస్టర్ ప్రవీణ్ ఎప్పుడు బయలుదేరారు.. విజయవాడకు వచ్చే దారిలో ఎన్నిసార్లు ఆగారు.. ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలపై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ శనివారం రాజమహేంద్రవరంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీసీటీవీ పుటేజీలతో సహా వివరాలు వెల్లడించారు.
Also Read: AP Inter results 2025: ఇంటర్ ఫలితాల్లో టాప్ జిల్లాలు, వెనుకబడిన జిల్లాలు ఇవే..
పాస్టర్ ప్రవీణ్ మృతిపై వివిధ రకాలుగా దర్యాప్తు చేపట్టినట్లు ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ప్రవీణ్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయలేదని, పోలీసుల దర్యాప్తుపై నమ్మకం ఉందని వారు చెప్పారని తెలిపారు. ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కొందరు మాట్లాడారని.. అయితే, వారు ఎలాంటి ఆధారాలూ ఇవ్వలేదని, సోషల్ మీడియాలో చెప్పినవన్నీ నిరాధార ఆరోపణలేనని ఐజీ చెప్పారు.
Also Read: Pawan Kalyan: పవన్ కల్యాణ్ కుమారుడిని కాపాడిన కార్మికులను సత్కరించిన ప్రభుత్వం
హైదరాబాద్ నుంచి విజయవాడకు బుల్లెట్ వాహనంపై వెళ్లే క్రమంలో హైదరాబాద్, కోదాడ, ఏలూరులో మద్యం దుకాణాలకు ప్రవీణ్ వెళ్లారని, ఆయన శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉన్నాయని ఎఫ్ఎస్ఎల్ నివేదిక చెప్పిందని ఐజీ అశోక్ తెలిపారు. దారిలో ఆయనకు మూడు సార్లు చిన్నచిన్న ప్రమాదాలు జరిగాయి. ఆరుసార్లు యూపీఐ పేమెంట్లు చేసినట్లు గుర్తించామని చెప్పారు. కీసర టోల్ ప్లాజా వద్ద ఆయన అదుపుతప్పి కిందపడిపోయారు. సాయం చేసేందుకు అంబులెన్స్, వైద్య సిబ్బంది వెళ్లారు. రామవరప్పాడు జంక్షన్ వద్ద ప్రవీణ్ పరిస్థితిని ఆటో డ్రైవర్ చూశారు. ట్రాఫిక్ ఎస్ఐ సూచనతో పార్కులో రెండు గంటలు ప్రవీణ్ నిద్రపోయారని చెప్పారు. ఆ తరువాత బండి కండీషన్ బాగాలేదు వెళ్లొద్దని చెప్పినా వినకుండా బయలుదేరాడు. హెడ్ లైట్ పగిలిపోవడంతో రైట్ సైడ్ బ్లింకర్ వేసుకునే ప్రయాణించాడని ఐజీ చెప్పారు.
ప్రవీణ్ ప్రయాణిస్తున్న బుల్లెట్ బండిని ఏ వాహనం కూడా ఢీకొట్టలేదు. ప్రమాద సమయంలో బైక్ కు పక్కనే వెళ్తున్న కారుకు చాలా గ్యాప్ ఉంది. ప్రమాద సమయంలో రోడ్డు పనులు జరుగుతున్న కారణంగా కంకర రాళ్లు ఉన్నాయి. బుల్లెట్ బండి వేగంగా వచ్చి రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో బండి ఫోర్త్ గేర్ లో ఉంది.. 70కిలో మీటర్ల వేగంతో బైక్ ప్రయాణిస్తోంది. కంకర కారణంగా బైక్ స్లిప్ అయ్యి రోడ్డుపక్కకు గుంతలోకి దూసుకెళ్లింది. గుంత అర్ధచంద్రాకారంలో ఉండటం వల్ల బండిపై నుంచి తొలుత ప్రవీణ్ కిందపడగా.. బైక్ ఎగిరి ఫాస్టర్ పై పడిందని చెప్పారు. అంతేతప్ప ప్రవీణ్ బుల్లెట్ బైక్ ను ఏ ఇతర వాహనాలు ఢీకొనలేదని ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు.