Jagan Mohan Reddy: సుప్రీంకోర్టులో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఊరట.. పిటిషన్ కొట్టివేత

సుప్రీంకోర్టులో ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఊరట లభించింది.

Jagan Mohan Reddy: సుప్రీంకోర్టులో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఊరట.. పిటిషన్ కొట్టివేత

Jagan Mohan Reddy

Updated On : January 27, 2025 / 12:27 PM IST

Jagan Mohan Reddy: సుప్రీంకోర్టులో ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఊరట లభించింది. జగన్ కేసుల ట్రయల్‌ బదిలీ కోరుతూ, బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రఘురామ కృష్ణ రాజు పిటిషన్ పై జస్టిస్‌ బివి నాగరత్న, జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ ధర్మాసనం విచారణ జరిపింది.

Also Read: శెభాష్ దేవాన్ష్.. నారా లోకేశ్ కొడుక్కి పవన్ కళ్యాణ్ ప్రశంస.. ఇంకా రికార్డులు బద్దలు కొట్టాలంటూ

తెలంగాణ హైకోర్టు జగన్ అక్రమాస్తుల కేసు పర్యవేక్షణ చేస్తోంది. గతంలో సుప్రీంకోర్టు ఎమ్మెల్యే, ఎంపీల కేసుల విషయంలో ఇచ్చిన తీర్పు ఈ కేసుకు కూడా వర్తిస్తుంది. ట్రయల్ కోర్టు రోజువారీ విచారణకు తీసుకోవాలని, హైకోర్టు కూడా పర్యవేక్షణ చేయాలని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా ధర్మాసనం తమ ఆదేశాల్లో పేర్కొంది. అందువల్ల.. మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై కూడా సుప్రీంకోర్టు లో ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని ధర్మాసనం పేర్కొనడంతో.. రఘురామ తరపు న్యాయవాది తమ పిటిషన్ ను వెనక్కు తీసుకున్నారు.