Jagan slams Pawan: వైసీపీ నేతలపై ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డ తీరుపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ఇవాళ అవనిగడ్డ ప్రభుత్వ కాలేజీలో నిర్వహించిన రైతుల క్లియరెన్స్ పత్రాల అందజేత కార్యక్రమంలో జగన్ పాల్గొని మాట్లాడారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ‘‘మూడు రాజధానులతో మంచి జరుగుతుందని మనం చెబుతున్నాం.. కానీ, మూడు పెళ్లిళ్లతో మంచి జరుగుతుంది.. మీరూ చేసుకోండని ఈ నేత చెబుతున్నారు. ఈ దుష్టచతుష్టయం మన ప్రభుత్వంపై యుద్ధం చేస్తుందట’’ అని అన్నారు.
‘‘చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోవడంతో కొందరు బూతులు తిడుతున్నారు. వీధి రౌడీలు కూడా అలాంటి భాష మాట్లాడరు. బూతులు మాట్లాడే వాళ్లను చూస్తే ఇలాంటి వాళ్లా మన నాయకులు అనిపిస్తోంది. దత్తపుత్రుడితో దత్త తండ్రి ఏం మాట్లాడిస్తున్నాడో మనం చూస్తున్నాం. వాళ్లంతా మన ప్రభుత్వంపై యుద్ధం చేస్తారట. ఒక్క జగన్ ను కొట్టడానికి ఇంత మంది ఏకమవుతున్నారు. మరో 18 నెలలు ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. ప్రజలంతా నాకు తోడుగా ఉంటారని నేను నమ్ముతున్నాను’’ అని జగన్ వ్యాఖ్యానించారు.
‘‘మంచికి, మోసానికి మధ్య 18 నెలలు యుద్ధం జరుగుతుంది. ప్రజలంతా నాకు తోడుగా ఉంటారని నేను నమ్ముతున్నాను. మంచి జరిగిందని నమ్మితే నా వైపు నిలబడడంది’’ అని జగన్ అన్నారు. కాగా, ఇటీవల పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తనను దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటున్నారని, పదే పదే అనవసరంగా తన మూడు పెళ్లిళ్ల విషయంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డ విషయం తెలిసిందే. పవన్ వ్యాఖ్యలపై పలువురు వైసీపీ నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..