Buddha Venkanna : బీసీలను మోసం చేసిన జగన్ ను తరిమి కొట్టండి : బుద్ధా వెంకన్న

జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు నిలిదీస్తున్నారని పేర్కొన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని బస్ యాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

Buddha Venkanna : బీసీలను మోసం చేసిన జగన్ ను తరిమి కొట్టండి : బుద్ధా వెంకన్న

TDP Leader Buddha Venkanna

Updated On : November 15, 2023 / 2:18 PM IST

Buddha Venkanna – Jagan : వైసీపీ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. నాలుగున్నర సంవత్సరాలుగా సీఎం జగన్ బీసీలను మోసం చేశారని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ బీసీల బస్ యాత్ర చేపట్టారని.. యాత్రకి జనాలు లేక వాయిదా వేసుకున్నారని తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు.

బీసీలను ఇబ్బందులకు గురిచేస్తున్న సీఎం జగన్ ను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు నిలిదీస్తున్నారని పేర్కొన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని బస్ యాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 33మంది బీసీలని ఊచకోత కోసిన చరిత్ర జగన్ ది అన్నారు. బీసీ మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తనపై 44 కేసులు పెట్టారని తెలిపారు. స్వాగతం పలికే క్రమంలో కేస్ లు పెట్టారని వెల్లడించారు.

YV Subbareddy : ఎన్ని పార్టీలు కలిసొచ్చినా వైసీపీదే గెలుపు : వైవీ సుబ్బారెడ్డి

తన ఫోన్ ఆధారంగా హైదరాబాద్ వచ్చి నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. బిటెక్ రవిని చంపాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ కి భయం పట్టుకుందని పులివెందులలో ఓటమి తప్పదని చెప్పారు. అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, కొల్లు రవీంద్ర, యనుమల రామకృష్ణుడు, కాల్వ శ్రీనివాసులు వంటి బీసీలపై వేధింపులు అధికమయ్యాయని పేర్కొన్నారు. కొడాలి నాని, వంశీపై ఒక్క కేసు లేదన్నారు.

పోలీసులు ఒక వారం సెలవు పెట్టాలని ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేయాలని టీడీపీనో వైసీపీనో తేల్చుకుంటామని చెప్పారు. పోలీసులు కూడా ప్రభుత్వంపై రివర్స్ కావాలన్నారు. లేకపోతే పోలీసులకు పాపం తగులుతుందన్నారు. ఎంపీ నాని వ్యాఖ్యలు ఖండిస్తున్నానని తెలిపారు. చంద్రబాబు జాతకం బాగానే ఉందని, జగన్ జాతకం బాగోలేదన్నారు.