×
Ad

అటు స్థానికం.. ఇటు కోటి సంతకాలు.. వైసీపీ స్పీడేది? జగన్ జిల్లాల పర్యటన ఆలస్యమవుతుందా?

వైసీపీని గ్రౌండ్ లెవెల్ వరకూ పటిష్ఠం చేయాలని జగన్ భావిస్తున్నారట. బూత్ స్థాయి దాకా కమిటీలు వేయాల్సిన బాధ్యత అయితే పాటీ నేతల మీదే పెట్టారు.

Jagan

Jagan Mohan Reddy: రావాలి.. మళ్లీ గెలవాలి.. వచ్చేది కూడా మనమే.. ఇక దూకుడే.. ఫీల్డ్‌లోనే ఉండాలి.. గ్రౌండ్‌ ప్రిపేర్ చేసుకోవాలి.. లీడర్లకు వైసీపీ అధినేత జగన్‌ పదేపదే చేస్తున్న దిశానిర్దేశం ఇది. వచ్చే ఎన్నికల వరకు జనంలోనే ఉండి..గెలిచి తీరాలని ఆశ పడుతున్నారు. అందుకోసం గతేడాది నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు.

జిల్లాల టూర్ చేపడుతారనని చెప్పి..ఇప్పటివరకు పెద్దగా యాక్టీవిటీ ఏం చెప్పట్టలేదు వైసీపీ అధినేత. అడపా తడపా పర్యటనలు చేస్తున్న జగన్ యాక్షన్ ప్లాన్ మార్చేస్తున్నారని అంటున్నారు. అయితే అధినేత ప్రణాళిక అమలు కాకుండా సొంత పార్టీ నేతల నుంచే బ్రేకులు పడుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. వైసీపీని గ్రౌండ్ లెవెల్ వరకూ పటిష్ఠం చేయాలని జగన్ భావిస్తున్నారట. బూత్ స్థాయి దాకా కమిటీలు వేయాల్సిన బాధ్యత అయితే పాటీ నేతల మీదే పెట్టారు.

లీడర్లు మాత్రం నియోజకవర్గాలను వదిలేసి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ లేకపోతే ఫారిన్‌కు చక్కర్లు కొడుతున్నారట. అయితే న్యూఇయర్‌ నుంచి గేర్ మార్చి స్పీడ్ పెంచాలని జగన్ ప్లాన్ చేస్తున్నారట. ఈ ఏడాది మధ్యలోనే జిల్లాల పర్యటన చేపడుతానంటూ ప్రకటించిన వైసీపీ అధినేత ఇప్పటివరకు జిల్లాల పర్యటనకు ప్లాన్ చేయలేదు.

Also Read: గులాబీ దళపతి వస్తున్నారు? సర్పంచ్ ఎన్నికలను కేసీఆర్ సీరియస్‌గా తీసుకుంటున్నారా?

అయితే జనవరి తర్వాత ఆయన డిస్ట్రిక్ టూర్లకు ప్రణాళిక రచిస్తున్నట్లు చెబుతున్నారు. ఆరు నెలల పాటు జగన్ జిల్లాల టూర్ సాగుతుందని అంటున్నారు. జిల్లాల పర్యటన తర్వాత 2026 జూలై 7, 8 తేదీల్లో వైసీపీ ప్లీనరీని నిర్వహించి..2027 జనవరి నుంచి జగన్ మహా పాదయాత్రకు శ్రీకారం చుడతారు అని అంటున్నారు.

ఇక స్థానిక పోరు స్టార్ట్‌ అయ్యే లోపే జగన్ జిల్లాల టూర్‌కు ప్లాన్ చేస్తున్నారట. ఫిబ్రవరి నుంచి జగన్‌ జిల్లాల పర్యటనకు షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై జగన్‌ పిలుపునిచ్చిన కోటి సంతకాల ఉద్యమం ఎంతవరకు వచ్చిందో క్లారిటీ లేదని వైసీపీ నేతలే చర్చించుకుంటున్నారు. తన హయాంలో మంజూరు చేసిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తోందన్న ఆరోపణలతో జగన్ గత నెల 9న కోటి సంతకాల ఉద్యమాన్ని ప్రకటించారు.

అందుకే సైలెంట్‌ అయిపోయిన వైసీపీ
నర్సీపట్నం మెడికల్ కాలేజీ భవనాల పరిశీలనకు వెళ్లిన వైసీపీ అధినేత..అ క్కడే కోటి సంతకాల ఉద్యమంపై ప్రకటన చేశారు. అక్టోబరు 10 నుంచి నవంబర్‌ 25 వరకు వివిధ దశల ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఆందోళనల్లో చివరి రోజు అయిన నవంబర్‌ 25 మంగళవారం రాష్ట్ర గవర్నర్ నజీర్‌ను కలిసి ప్రజల అభ్యంతరాలను తెలియజేస్తామని ప్రకటించారు.

అయితే ముందుగా చెప్పిన ప్రకారం మెడికల్ కాలేజీలపై ఆందోళనలు చేసిన వైసీసీ..ఆ తర్వాత సైలెంట్‌ అయిపోయినట్లు విమర్శలు ఎదుర్కొంటోంది. జగన్ పిలుపుతో నియోజకవర్గ కేంద్రాల్లో కార్యకర్తలు ఆందోళనలు చేశారు. కానీ అధినేత మాత్రం ఎక్కడా, ఎప్పుడూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్‌ చేయలేదంటున్నారు. ఇక చివరికి గవర్నర్‌కు కోటి సంతకాల పత్రాలు సమర్పించాల్సిన రోజున ఆ కార్యక్రమం జరగలేదు. కోటి సంతకాల ఉద్యమంపై వైసీపీ నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

వైసీపీ ముందుగా చెప్పిన షెడ్యూల్ ప్రకారం మంగళవారం గవర్నర్‌ను కలుస్తారని అంతా భావించారు. జగన్ ఆ విషయం మరచిపోయారో లేక ఇంకో రోజుకు వాయిదో వేశారో కానీ, ఆయన మంగళవారం పులివెందుల పర్యటనకు వెళ్లిపోయారు. ఇదే సమయంలో వైసీపీలో ఇతర నాయకులు ఎవరూ కూడా కోటి సంతకాల ఉద్యమంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

అసలు కోటి సంతకాల కార్యక్రమం ఉందా లేక మరోసారి నిర్వహిస్తారా అనేది క్లారిటీ లేదు. మెడికల్ కాలేజీలపై వైసీపీ చేపట్టిన ఉద్యమంతో కూటమి ప్రభుత్వం ఇరకాటంలో పడటం ఖాయమన్న చర్చ జరిగినా..చివరికి ఆ కార్యక్రమాన్ని వైసీపీనే చివరిదాక తీసుకెళ్లలేకపోయిందన్న టాక్ నడుస్తోంది.