Pawan Kalyan : బూతులు తిట్టే ఒక్కొ వైసీపీ నేతను ఇళ్లల్లోంచి లాక్కొచ్చి కొడతా : పవన్ కళ్యాణ్

బూతులు తిట్టే ఒక్కొ వైసీపీ నేతను ఇళ్లల్లోంచి లాక్కొచ్చి కొడతా..అంటూ పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నానంటూ వ్యాఖ్యలు చేసేవారిని పవన్ గట్టి కౌంటర్ ఇస్తూ..ఒక్క పెళ్లి చేసుకొని 30 మంది ప్టెపినీలతో తిరిగే మీకేందిరా నేను సమాధానం చెప్పేది అంటూ వైసీపీ నేతలను ఎండగట్టారు.

Pawan Kalyan : బూతులు తిట్టే ఒక్కొ వైసీపీ నేతను ఇళ్లల్లోంచి లాక్కొచ్చి కొడతా : పవన్ కళ్యాణ్

Jana Sena chief Pawan Kalyan gives strong warnings to YCP leaders

Updated On : October 18, 2022 / 3:13 PM IST

Pawan Kalyan : విశాఖపట్టణం ఘటన తరువాత మంగళగిరి పార్టీ కార్యాలయానికి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు దిశానిర్ధేశం చేస్తూ వైసీపీ నేతలపై ఫుల్ ఫైర్ అయ్యారు. నాపై నిరాధారమైన విమర్శలు చేస్తూ ..బూతులు తిట్టే ఒక్కొ వైసీపీ నేతను ఇళ్లల్లోంచి లాక్కొచ్చి కొడతా అంటూ పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. నన్ను ప్యాకేజీ స్టార్ అనే సన్నాసుల్ని చెప్పు తీసుకుని పళ్లు రాలగొడతా..ఒక్క చేతితో గొంతు పిసికేస్తా అంటూ అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అందరు నేతలను తాను అనటం లేదని కేవలం బూతుల పంచాంగం మాట్లాడేవారిని మాత్రమే తాను అంటున్నానంటూ పవన్ స్పష్టంచేశారు.

Janasena : నన్ను ప్యాకేజ్ స్టార్ అన్న సన్నాసిని చెప్పు తీసుకుని కొడతా : పవన్ కళ్యాణ్

మాట్లాడితే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ చేసే వైసీపీ నేతల వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు జనసేనాని. మాట్లాడితే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని అంటున్నారని… మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండిరా ఎవడొద్దన్నాడు? నేను భార్యకు విడాకులు ఇచ్చి మరో వివాహం చేసుకున్నాను..మీలాగా భార్యను ఇంట్లో ఉంచుకుని ముగ్గురు నలుగురు స్టెఫ్నీలను పెట్టుకోలేదంటూ దుయ్యబట్టారు. తొలి భార్యకు రూ. 5 కోట్లు ఇచ్చానని, రెండో భార్యకు మిగతా ఆస్తి ఇచ్చానని ఆ తర్వాత మూడో పెళ్లి చేసుకున్నానని, విడాకులు తీసుకుని పెళ్లి చేసుకున్నానని చెప్పారు. ఒక్క పెళ్లి చేసుకొని 30 మంది ప్టెపినీలతో తిరిగే మీకేందిరా నేను సమాధానం చెప్పేది అంటూ వైసీపీ నేతలను ఎండగట్టారు పవన్. బూతులు తిట్టే ఒక్కో వైసీపీ నేతను చొక్కా పట్టుకుని ఇళ్లలోంచి లాక్కొచ్చి కొడతా కొడకల్లారా అంటూ తీవ్రంగా హెచ్చరించారు.

వైసీపీ నేతలపై సన్నాసులు, ఎదవలు అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. నేను లండన్ లోనే, న్యూయార్క్ లోనే పెరగలేదు..పక్కా బాపట్లలో పుట్టానని.. గొడ్డుకారం తిన్నా..మీలాగా నేను మాట్లాడటం వచ్చు..కానీ నాకు సంస్కారం ఉందని మీలాగా అడ్డదిడ్డంగా వ్యవహరించటం చేయనని అన్నారు. నేనో కానిస్టేబుల్ కొడుకుని.. ఐపీఎస్ ఆఫీసర్ కొడుకును కాదని… మాంచి ఇంగ్లీష్ నాకు రాదు..ముతక భాష వచ్చని… సంస్కారం ఉంది కాబట్టే ఇంత కాలం మీరు బూతులు తిడుతున్నా మూసుకుని ఉన్నా..మీలాగా నేను కూడా ఉచ్ఛం నీచ్ఛం మర్చిపోతే మీకంటే ఎక్కువగా మాట్లాడగలనన్నారు. మీకు మంచి పని చేయదని, శిక్షించడమే కరెక్ట్ అని చెప్పారు. వెధవలు అంటే వైసీపీలో ఉన్న అందరూ కాదని… బాలినేని శ్రీనివాస్, ఆనం రాంనారాయణరెడ్డి లాంటి మంచి వ్యక్తులు కూడా ఆ పార్టీలో ఉన్నారని అన్నారు. అలాంటి మంచి వ్యక్తులు కాకుండా బూతులు మాట్లాడే ప్రతి కొడుక్కి చెపుతున్నా.. నుంచోబెట్టి తోలు ఒలుస్తా అందరికీ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ తో వార్నింగ్ ఇచ్చారు.

Pawan Kalyan: వైసీపీతో నేను యుద్ధానికి సిద్ధం.. దేంతోనైనా రండి తేల్చుకుందాం

మీరు క్రిమినల్ పాలిటిక్స్ చేస్తారు..నేను మాత్రం బలమైన సిద్ధాంతాలతో కూడిన రాజకీయాలు చేస్తానని స్పష్టం చేశారు. యుద్ధానికి సిద్ధమని మీరు చెపితే… రాళ్లా, హాకీ స్టిక్సా దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. ఎంతమంది వైసీపీ గూండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో రండిరా ఛాలెంజ్ విసురుతున్నా అంటూ ఛాలెంజ్ చేశారు. ఇప్పటి వరకు పవన్ మంచితనం, సహనం చూశారని… ఈరోజు నుంచి యుద్ధమేనని స్పష్టం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.