Pawan Kalyan : జగ్గూ భాయ్‌ని ఎలా కంట్రోల్ చేయాలో జనసేనకు బాగా తెలుసు- పవన్ కల్యాణ్

Pawan Kalyan : అధికారం కోసం కాదు మార్పు కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చా.

Pawan Kalyan (Photo : Twitter)

Pawan Kalyan – CM Jagan : ఏపీ సీఎం జగన్ టార్గెట్ గా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెలరేగిపోతున్నారు. సీఎం జగన్ పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఛాన్స్ చిక్కితే చాలు జగన్ పై నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా సీఎం జగన్ కి కొత్త పేరు పెట్టారు జగన్. జగ్గూ భాయ్ అని సంబోధిస్తూ హాట్ కామెంట్స్ చేశారు.

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని పవన్ వాపోయారు. రోజురోజుకు మహిళల్లో భయం‌ పెరుగుతోందన్నారు. క్రిమినల్స్ కు చట్టాలంటే భయం లేదని మండిపడ్డారు. నేను నా కోసం పోరాటం చేయడం లేదు. నిస్సహాయతలో ఉన్న ప్రజల కోసమే నా పోరాటం. అధికారం కోసం కాదు మార్పు కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చా. మన దగ్గర సమర్థత ఉంది కాబట్టే దేశ ప్రధాని నాకు అపాయింట్ మెంట్ ఇస్తున్నారు. జగన్ అనే వాడు రౌడీ పిల్లాడు. జగ్గూ భాయ్ ని ఎలా కంట్రోల్ చేయాలో జనసేనకు బాగా తెలుసు” అని పవన్ కల్యాణ్ అన్నారు.

Also Read..Ashok Gajapathi Raju: అంతుబట్టని అశోక్ గజపతిరాజు అంతరంగం.. ఇంతకీ ఆయన మనసులో ఏముంది?

”జగ్గూ భాయ్ గ్యాంగ్ లాంటి చిల్లర గ్యాంగులకు కూడా మనం భయపడతామా? ఇటువంటి గ్యాంగుల సంగతి ప్రధానికి చెబుతామా? మనమే కొట్టి పారేస్తాం. మధ్య తరగతి కుటుంబం బాధలు నాకు బాగా తెలుసు. నేను నా కుటుంబంలో కళ్లారా చూశాను.

చిన్నపాటి ఉద్యోగస్తుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాడు. అవినీతి.. ఉద్యోగుల జీవితంలో భాగంగా మారిపోయింది. రాజకీయ నాయకులు చేస్తున్న అవినీతి చాలా ఎక్కువ అయిపోయింది. తణుకులో టీడీఆర్ బాండ్స్ స్కాము 309 కోట్లు. అధికారులు చేసే చిన్న చిన్న అవినీతి కంటే ఇటువంటి రాజకీయ అవినీతి ప్రమాదకరమైనవి. జనసేన.. రాజకీయ అవినీతిపై పోరాటం చేస్తుంది” అని పవన్ కల్యాణ్ చెప్పారు.

Also Read.. Pawan Kalyan: నాపై దెబ్బ పడినట్లే లెక్క.. ఇక శ్రీకాళహస్తి వస్తా అక్కడే తేల్చుకుంటా: పవన్ కల్యాణ్

మరోవైపు మాజీమంత్రి పేర్ని నానిపై పరోక్షంగా మరోసారి సెటైర్లు వేశారు పవన్ కళ్యాణ్. ”అన్నవరంలో పోయిన చెప్పులు మచిలీపట్నంలో కనిపించాయి. గతంలో అత్తారింటికి దారేది సినిమా పైరసీ కూడా మచిలీపట్నంలోనే వచ్చింది. చెప్పులు అలాగే అత్తారింటికి దారేది సినిమా పైరసీ రెండూ మచిలీపట్నంలోనే వెలుగులోకి వచ్చాయి. దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉంది” అని పవన్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు