Pawan Kalyan Warns : ప్రభుత్వాలు మారతాయి.. గుర్తు పెట్టుకోండి- పవన్ వార్నింగ్

సమస్యలపై నిలదీసిన వారిపై దాడులు చేస్తాం. వ్యక్తిగతంగా దూషిస్తాం అంటే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రభుత్వాలు మారతాయి గుర్తు పెట్టుకోండి.

Pawan Kalyan Warns : ప్రకాశం జిల్లా రైతు ప్రతినిధులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిశారు. తమ ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలులో అక్రమాలు, మోసాలు జరుగుతున్నాయని వారు వాపోయారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు.

అన్నం పెట్టే రైతన్న రాష్ట్రంలో బహిరంగంగా మోసపోతున్నాడని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. కర్షకుడు తన కష్టాన్ని అమ్ముకునే క్రమంలో కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి అతడి కష్టం దోచుకుంటున్నారని పవన్ మండిపడ్డారు. రైతు భరోసా కేంద్రాలు రైతును ముంచుతున్నాయన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వాళ్లు.. మిల్లర్లతో కుమ్మక్కై రైతుని ముంచేస్తున్నారని పవన్ ఆరోపించారు. మిల్లర్లు రైతుకి కనీస ధర ఇవ్వకుండా నష్టపరుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. గడప గడపకు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తే.. బెదిరింపులకు దిగారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Janasena: కోనసీమలో చిచ్చుపెట్టింది ప్రభుత్వమే: నాదెండ్ల మనోహర్

“క్వింటాలు ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర ఏ మాత్రం రైతుకు అందడం లేదు. రైతులకు అండగా ఉండాల్సిన రైతు భరోసా కేంద్రాల వాళ్లు మభ్యపెట్టి సగం ధరకే అమ్ముకునేలా చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల్లోని సిబ్బంది మిల్లర్లతో కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారు. స్థానిక సివిల్ సప్లయ్ అధికారులు, జిల్లా కలెక్టర్ ఈ సమస్యపై దృష్టి సారించాలి.

రైతుల తరపున జనసేన పార్టీ పోరాడుతుంది. పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలోనూ దీనిపై చర్చించి కార్యాచరణ సిద్దం చేస్తాం. ఓ ప్రణాళిక ప్రకారం అన్నదాతకు న్యాయం జరిగేలా పోరాడతాం.

Janasena Nagababu : పవన్.. నిప్పుల్లో దూకమంటే దూకాలి, 2024లో సీఎంగా చూసుకోవచ్చు-నాగబాబు

గడప గడపకు వెళితే జేజేలు కొడతారని ఎలా అనుకున్నారు? రైతు ప్రతినిధులపై మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆయన అనుచరులు వ్యక్తిగతంగా దాడులు చేయడం, ఆడబిడ్డలను కించపరిచేలా మాట్లాడటం ఆమోదయోగ్యం కాదు. మిమ్మల్ని ఎవరూ ప్రశ్నించకూడదు అనుకుంటే గడప గడపకు కార్యక్రమాన్ని చేపట్టకుండా ఉండాల్సింది. సమస్యలపై నిలదీసిన వారిపై దాడులు చేస్తాం. వ్యక్తిగతంగా దూషిస్తాం అంటే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు. రైతు ప్రతినిధులకు అండగా ఉంటాం. వ్యక్తిగతంగా దూషణలకు దిగే వారికి ఒకటే చెబుతున్నాం. ప్రభుత్వాలు మారతాయి గుర్తు పెట్టుకోండి” అని వార్నింగ్ ఇచ్చారు పవన్.

ట్రెండింగ్ వార్తలు