Janasena: కోనసీమలో చిచ్చుపెట్టింది ప్రభుత్వమే: నాదెండ్ల మనోహర్

మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో పీఏసీ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, నాగబాబు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనపై విమర్శలు చేశారు.

Janasena: కోనసీమలో చిచ్చుపెట్టింది ప్రభుత్వమే: నాదెండ్ల మనోహర్

Janasena

Janasena: పచ్చని కోనసీమలో జిల్లా పేరుతో చిచ్చుపెట్టింది వైసీపీ ప్రభుత్వమే అని, ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంతోనే కుట్ర చేసింది అని అభిప్రాయపడ్డారు జనసేన పీఏసీ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో పీఏసీ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, నాగబాబు, తదితరులు పాల్గొన్నారు.

Major: మేజర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. తొలిరోజే సగం వసూలు!

ఈ సందర్భంగా వైసీపీ పాలనపై విమర్శలు చేశారు. ‘‘అనంతబాబు చేసిన హత్యను డైవర్ట్ చేసేందుకే కుల విద్వేషాలు రెచ్చగొట్టింది వైసీపీ. కోనసీమలో చిచ్చుకు ప్రభుత్వమే కారణం. ఈ ఘటనలో డీజీపీ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వైసీపీ నాయకుల కుట్రలు ప్రజలకు అర్థమయ్యాయి. సీఎం ఇప్పటివరకు ఈ ఘటనపై స్పందించలేదు. జనసేనకు చెడ్డ పేరు రావాలనే సీఎం కుట్ర చేశారు. కౌలు రైతుల కష్టాలు చూసి పవన్ కళ్యాణ్ ఐదు కోట్ల రూపాయల భారీ సాయం ప్రకటించారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు లక్ష చొప్పున సాయం అందిస్తున్నారు. సీఎం సొంత జిల్లా కడపలో 132 మంది రైతులు, పులివెందులలో 11 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కడప జిల్లా పులివెందులలో త్వరలో కార్యక్రమం నిర్వహిస్తాం. కడప జిల్లా రైతులకు పవన్ కళ్యాణ్ సాయం చేస్తారు. ప్రభుత్వం పెట్టించే అక్రమ కేసులపై పోరాడేందుకు పార్టీ తరఫున న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేశాం. కార్యకర్తలకు పార్టీ పరంగా అండగా ఉంటాం.

Sologamy: గుడిలో ఆమె పెళ్లికి అంగీకరించం: గుజరాత్ బీజేపీ మహిళా నేత

2019 ఎన్నికల్లో ఫలితాల తర్వాత పార్టీ జెండా వదలని వారిని గుర్తించండి. అందరూ పార్టీలో క్రమశిక్షణ కలిగి ఉండాలి. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాలి. పవన్ కళ్యాణ్ ఆలోచనలు అర్థమయ్యేలా పవన్ కళ్యాణ్ మనోగతం అనే పుస్తకం రూపొందించాం. పవన్ కల్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి అవసరం. సమష్టిగా కృషి చేస్తేనే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలం’’ అని నాదెండ్ల ప్రసంగించారు.