Kiran Royal : జగన్ 2.0 ఫోటో విడుదల చేశానని నా జీవితాన్ని నాశనం చేయాలని వైసీపీ నేతలు చూశారని తిరుపతి నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. మళ్లీ చెబుతున్నా.. ఈ చిట్టి రెడ్డి పోస్టర్ అంటే నాకు చాలా ఇష్టం. నా జీవితాన్ని మార్చింది చిట్టి రెడ్డి 2.0 పోస్టర్ అని ఆయన అన్నారు. వైసీపీ సోషల్ మీడియా నా మీద పెట్టిన శ్రద్ధ జగన్ మీద పెట్టి ఉంటే 10 సీట్లు ఎక్కవగా వచ్చేవని కిరణ్ రాయల్ చెప్పారు.
జగన్ మీద పది రూపాయల పోస్టర్ తయారు చేస్తే 10 కోట్ల పబ్లిసిటీని వైసీపీ క్యాడర్ నాకు ఇచ్చిందన్నారు. ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాల్సిన వైసీపీ నేతలు తనను టార్గెట్ చేసి, తన మీద విషం చిమ్మారని కిరణ్ రాయల్ ధ్వజమెత్తారు.
Also Read : కిరణ్ రాయల్‌పై ఆరోపణలు చేసిన లక్ష్మి అరెస్ట్.. తప్పించుకు తిరుగుతున్న ఆమెను పోలీసులు ఎలా దొరకబట్టారో తెలుసా?
పాతిక లక్షలు ఇచ్చి ఆమెను నా మీద ప్రయోగించారు..
”వారి కుటుంబం మీద ఈగ వాలకుండా చూసుకునే వ్యక్తిని నేను. పవన్ కల్యాణ్ అభిమాని అంటూ కాలర్ ఎగరేసుకుని తిరుగుతా. వైసీపీ నేతలు రాజకీయాల కోసం మహిళను వాడుకున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబం పాతిక లక్షల డబ్బు అమెకు ఇచ్చి నా మీద ప్రయోగించారు.
ఇప్పుడు ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు.
ఆమెపై 3 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తా..
రెండేళ్లుగా అజ్ఞాతంలో ఉన్న ఆమెను బయటకు తీసుకొచ్చి జైపూర్ పోలీసులతో అరెస్ట్ చేయించింది వైసీపీనే. అ మహిళ మీద 3 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తా. అమె కోసం వాదించింది వైసీపీ లాయర్లు. వారు ఎక్కడ నుండి వచ్చారు? నాకు ఒక కూతురు, చెల్లి, అక్క ఉంది. కాబట్టి గౌరవంగా మాట్లాడుతున్నా.
ఆడవాళ్ళను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం వైసీపీకే చెల్లింది..
అ మహిళపై పలు రాష్ట్రాల్లో చాలా కేసులు ఉన్నాయి. ఆడవాళ్ళను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం వైసీపీకే చెల్లింది. నిజం నిప్పులాంటిది. పార్టీకి నా మీద వచ్చిన ఆరోపణపై వివరణ ఇస్తాను. కోర్టులో న్యాయం గెలుస్తుంది. నాకు అండగా ఉన్న జనసేన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు” అని కిరణ్ రాయల్ అన్నారు.
Also Read : అలా చేయకపోతే.. 60 రోజుల్లో జగన్ అనర్హతకు గురవుతారు- డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాట్ కామెంట్స్
కిరణ్ రాయల్‌పై ఓ మహిళ ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. నన్ను మోసం చేసి డబ్బులు తీసుకున్నారు అంటూ కిరణ్ రాయల్‌పై సోషల్ మీడియాలో ఆమె చేసిన ఆరోపణలు కలకలానికి దారితీశాయి. ఇంతలోనే ఆ మహిళ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ ముగించుకుని వెళ్తున్న ఆమెను జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ మోసం కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఆన్ లైన్ చీటింగ్ కేసులో లక్ష్మీ ప్రధాన ముద్దాయిగా ఉందని పోలీసులు తెలిపారు. కొన్ని రోజులుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతోందన్నారు. రెండు రోజులుగా వీడియోలలో ప్రత్యక్షం కావడంతో జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.