Janasena Song : ఆవిర్భావ దినోత్సవానికి ముందు.. జనసేన కొత్త సాంగ్ రిలీజ్.. ‘జెండర.. జెండర.. జెండర..’
తాజాగా ఆవిర్భావ దినోత్సవం ముందు మరో సాంగ్ విడుదల చేసారు.

Janasena New Song Released before Janasena Formation Day by Nagababu
Janasena Song : ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక మొదటిసారి జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఘనంగా జరుపుకుంటుంది. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వద్ద మార్చి 14వ తేదీన జనసేన ఆవిర్భావ సభ ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఈ సభకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే జనసేన పార్టీపై పలు సాంగ్ ఉండగా తాజాగా ఆవిర్భావ దినోత్సవం ముందు మరో సాంగ్ విడుదల చేసారు. ‘జెండర.. జెండర.. జెండర.. సామాన్యుడికి అండరా.. పిడిగిలి బిగించి పట్టారా ఇది జనసేనాని జెండర..’ అంటూ ఈ సాంగ్ పవర్ ఫుల్ గా సాగింది. ఈ పాటకి దుంపటి శ్రీనివాస్ లిరిక్స్ రాయగా సింధు కె ప్రసాద్ సంగీతం అందించారు.
Also Read : Lovely Teaser : ‘లవ్లీ’ టీజర్ చూశారా? ఇదేదో రాజమౌళి ఈగ సినిమాలా ఉందే.. ఈగ అమ్మాయిగా మాట్లాడితే..
నేడు ఈ పాటని నాగబాబు విడుదల చేసారు. దీంతో ఈ పాటని జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. మీరు కూడా ఈ పాట వినేయండి..