Janasena : ధర్మారెడ్డిని టీటీడీ ఈవోగా కొనసాగించడంపై జనసేన మండిపాటు

ధర్మారెడ్డికి టీటీడీ ఈవో పదవి ఇవ్వడానికి కారణం ఏంటని నిలదీశారు. జేఈవో గా అడుగుపెట్టిన ధర్మారెడ్డి.. టీటీడీలో అధర్మారెడ్డి గా పేరు గడించారని విమర్శించారు.

Janasena : ధర్మారెడ్డిని టీటీడీ ఈవోగా కొనసాగించడంపై జనసేన మండిపాటు

Janasena

Updated On : May 10, 2022 / 2:29 PM IST

Janasena party : టీటీడీ ఈవోగా ధర్మారెడ్డిని కొనసాగించడంపై జనసేన మండిపడింది. టీటీడీని నువ్వే కాపాడుకోవాలి గోవిందా… అంటూ నినాదాలు చేస్తూ ఓ హోటల్ లో జనసేన నేతలు డాక్టర్ హరిప్రసాద్, కిరణ్ రాయల్ మీడియాతో మాట్లాడారు. టీటీడీ ఈవోగా నియమించడానికి రాష్ట్రంలో ఐఏఎస్ లు దొరకలేదా? నాన్ ఐఏఎస్ ను టీటీడీ ఈవోగా ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు.

ధర్మారెడ్డికి టీటీడీ ఈవో పదవి ఇవ్వడానికి కారణం ఏంటని నిలదీశారు. జేఈవో గా అడుగుపెట్టిన ధర్మారెడ్డి.. టీటీడీలో అధర్మారెడ్డి గా పేరు గడించారని విమర్శించారు. ఈ నెల 14న ధర్మారెడ్డి పదవీకాలం ముగియనుంది.

TTD in Delhi: దేశరాజధాని ఢిల్లీలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు: ప్రకటించిన టీటీడీ

ఆ తర్వాత కూడా ఆయనను టీటీడీలో కొనసాగిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ధర్మారెడ్డికి ఇది వరకే ఎస్వీ భక్తి ఛానల్ తో పాటు వేదిక్ యూనివర్సిటీలను అక్రమంగా కట్టబెట్టారని విమర్శించారు.