TTD in Delhi: దేశరాజధాని ఢిల్లీలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు: ప్రకటించిన టీటీడీ

 దేశ రాజధాని ఢిల్లీలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. టీటీడీ ఆధ్వర్యంలో ఢిల్లీలో మే 12 నుంచి 22 వరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.

TTD in Delhi: దేశరాజధాని ఢిల్లీలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు: ప్రకటించిన టీటీడీ

Ttd

TTD in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. టీటీడీ ఆధ్వర్యంలో ఢిల్లీలో మే 12 నుంచి 22 వరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈమేరకు ఢిల్లీలోని టీటీడీ స్థానిక సలహా కమిటీ అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదివారం వివరాలు వెల్లడించారు. ఢిల్లీలోని గోలే మార్కెట్ లోని టీటీడీ బాలాజీ మందిర్ లో 11 రోజుల పాటు ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మే 12న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. మే 17న కళ్యానోత్సవం, మే 22న పుష్పయాగం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మే 12 తేదీ నుంచి 22 తేదీ వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు.

Also read:Tirumala Devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ: 23 కంపార్టుమెంటుల్లో భక్తులు

ఢిల్లీ ప్రభుత్వం విధించిన కోవిడ్ నిభంధనలకు అనుగుణంగా బ్రహ్మోత్సవ వాహన సేవలు జరుగుతాయని ప్రశాంతి రెడ్డి వెల్లడించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఢిల్లీలో ఘనంగా నిర్వహించనున్నామని, భక్తులు ఉచితంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనవచ్చని టీటీడీ ప్రకటించింది. తిరుపతి నుంచి వచ్చిన 30 మంది అర్చకుల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల నిర్వహణ ఉంటుంది. ఢిల్లీలో ఉన్న ప్రముఖులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తోంది టీటీడీ. ఢిల్లీ టిటిడి స్థానిక సలహా కమిటీ సభ్యుల సొంత నిధులతోనే ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు.

Also read:Gyanvapi Swasthika: మసీదు సర్వేలో బయటపడ్డ హిందూ పురాతన స్వస్తికలు: ఆందోళన నేపథ్యంలో సర్వే నిలిపివేత