Kadapa Mayor Vs MLA : మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే .. కడప కార్పొరేషన్‌లో కుర్చీ కోసం రచ్చ రచ్చ..

తన కుర్చీ లాగేస్తారనే భయం మేయర్ కు పట్టుకుందని.. అందుకే ఆయన కుర్చీలాట ఆడుతున్నారని ఎమ్మెల్యే మాధవి రెడ్డి విమర్శించారు.

Kadapa Mayor Vs MLA : కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మాధవి రెడ్డికి వేదికపై కుర్చీ ఏర్పాటు చేయలేదు. దీనిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళను మేయర్ అవమానపరుస్తున్నారంటూ ఆరోపించారు. మహిళను అవమానిస్తే వైసీపీ నాయకులు సంతోషిస్తారా? అంటూ ప్రశ్నించారు. తన కుర్చీ లాగేస్తారనే భయం మేయర్ కు పట్టుకుందని.. అందుకే ఆయన కుర్చీలాట ఆడుతున్నారని ఎమ్మెల్యే మాధవి రెడ్డి విమర్శించారు.

పోలీసులు భారీ బందోబస్తు..
కడప మున్సిపల్ సమావేశంలో భాగంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత నెల 7న కుర్చీ వివాదం జరిగిన క్రమంలో సమావేశం వాయిదా పడింది. మరోవైపు కుర్చీ వివాదంపై కడపలో ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ క్రమంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు.

మున్సిపల్ కార్పొరేషన్ లో టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశమని, తన అనుచరులతో వచ్చి వీరంగం సృష్టించారంటూ వైసీపీ శ్రేణులు మండిపడ్డాయి. మేయర్ తో పాటు తనకూ కుర్చీ ఏర్పాటు చేయాలని మళ్లీ హంగామా చేశారంటూ విమర్శించారు.

Also Read : అల్లుడి కోసం మామ.. గాంధీభవన్ కు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి

కడప కార్పొరేషన్ లో మరోసారి కుర్చీ ఫైట్ జరిగిందని చెప్పొచ్చు. కుర్చీ విషయంలో మేయర్ సురేశ్ బాబు, ఎమ్మెల్యే మాధవి రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వేదికపై మేయర్ కు మాత్రమే కార్పొరేషన్ సిబ్బంది కుర్చీ వేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు ఎమ్మెల్యే మాధవి రెడ్డి. తనకు కుర్చీ వేయకపోవడంతో ఆమె అక్కడే నిలబడి నిరసన తెలిపారు.

మేయర్, ఎమ్మెల్యే మధ్య కుర్చీ ఫైట్..
గత నెలలో జరిగిన జనరల్ పార్టీ సమావేశంలో ఏ అంశంపై గొడవ జరిగిందో.. అదే సీన్ మరోసారి రిపీట్ అయ్యిందని చెప్పొచ్చు. ఇవాళ మాధవి రెడ్డి మరోసారి కార్పొరేషన్ కార్యాలయంలోకి వచ్చిన సందర్భంలో అక్కడ తనకు వేయాల్సిన కుర్చీ ఇవాళ కూడా కనిపించకపోవడంతో ఆమె నిలబడి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరి మధ్య మరోసారి కుర్చీ ఫైట్ కు దారితీసిందని చెప్పొచ్చు.

మేయర్ కు మాత్రమే కుర్చీ వేసి ఎమ్మెల్యేకు కుర్చీ వేయకపోవడంతో.. మహిళను అవమానించారంటూ ఎమ్మెల్యే తరపున వచ్చిన కౌన్సిలర్లు కార్పొరేషన్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తన కుర్చీ లాగేస్తారేమో అనే భయంతో మేయర్ సురేశ్ బాబు కుర్చీ మీద నుంచి కూడా లేవడం లేదని ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే మిమ్మల్ని గౌరవిస్తామని మేయర్ తేల్చి చెప్పారు.

గత ప్రభుత్వం హయాంలో మూడు కుర్చీలు వేసేవారు..
గత ప్రభుత్వం హయాంలో వేదికపై మూడు కుర్చీలు ఉండేవి. ఒక కుర్చీ మేయర్ కి, ఒక కుర్చీ కడప ఎమ్మెల్యేకి, మరొక కుర్చీ కమలాపురం ఎమ్మెల్యేకి. ఈ ముగ్గురికి ప్రాధాన్యత ఇస్తూ వేదికపై కుర్చీలు ఏర్పాటు చేసేవారు. కానీ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా ఎమ్మెల్యే మాధవి రెడ్డికి కేటాయించిన కుర్చీని రెండో సమావేశానికి లేకుండా చేశారు. మొదటి సమావేశంలో మేయర్, ఎమ్మెల్యే మధ్య జరిగిన వాగ్వాదమే ఇందుకు ప్రధాన కారణం.

Also Read : పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లా పర్యటనలో తొక్కిసలాట.. స్పృహతప్పి పడిపోయిన బాలిక