Video: పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లా పర్యటనలో.. స్పృహతప్పి పడిపోయిన బాలిక
గొడవర్రు రోడ్డులో పవన్ పర్యటిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కృష్టా జిల్లా పర్యటనలో స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ బాలిక స్పృహతప్పి పడిపోయింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. గొడవర్రు రోడ్డులో పవన్ పర్యటిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కాగా, పవన్ కల్యాణ్ ఇవాళ ఉదయం 10 గంటలకు కంకిపాడు మండలం గుడువర్రు గ్రామంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం గుడివాడ మండలంలోని మల్లయ్యపాలెం గ్రామం చేరుకున్నారు. అక్కడ రక్షిత తాగు నీటి పథకానికి సంబంధించిన కార్యక్రమాలను పరిశీలించారు.
కాగా, మూడు రోజుల నుంచి ఉత్తరాంధ్రలో పవన్ కల్యాణ్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ బల్లగరువులో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
బల్లగరువు గ్రామా ప్రజలతో ముచ్చటించారు. ఆ తర్వాత విశాఖ నుంచి పాడేరు ఏజెన్సీకి బయల్దేరి అనంతగిరి మండలం బల్లగరువులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
నిన్న కూడా పవన్ కల్యాణ్ అనంతగిరిలో పర్యటించారు. జోరువానలో… బురద నీటిలో సైతం లెక్కచేయకుండ అనంతగిరి పర్యాటనకు వచ్చిన పవన్ ను ఆహ్వానిస్తూ గిరిజనులు జానపద గీతం పాడారు. ఇవాళ పవన్ కల్యాణ్ గొడవర్రు రోడ్డులో పర్యటిస్తున్నారు.