Kanna Lakshmi Narayana: మోదీ పట్ల జీవితాంతం అభిమానంతో ఉంటా.. రాష్ట్ర పార్టీలో పరిస్థితులకు ఇమడలేకే రాజీనామా..

భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీ నేత, ఏపీ మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కన్నా రాజీనామా లేఖను పంపించారు. గురువారం తన అనుచరులతో భేటీ అయిన అనంతరం తన రాజీనామా విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీపై కన్నా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Kanna Lakshmi Narayana: భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీ నేత, ఏపీ  మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కన్నా రాజీనామా లేఖను పంపించారు. గురువారం తన అనుచరులతో భేటీ అయిన అనంతరం తన రాజీనామా విషయాన్ని కన్నా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర పార్టీ అధిష్టానంపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ పట్ల జీవితాంతం అభిమానంతోనే ఉంటానన్న కన్నా.. రాష్ట్ర పార్టీలో పరిస్థితులకు ఇమడలేక బీజేపీ నుంచి తప్పుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

Kanna Lakshmi Narayana : అమరావతి రైతుల యాత్రకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత- కన్నా లక్ష్మీనారాయణ

2014లో నరేంద్ర మోదీ నాయకత్వంపట్ల ఆకర్షితులై బీజేపీలో చేరి అప్పటినుంచి ఈరోజు వరకు ఏ స్థాయిలో ఉన్నా పార్టీ బలోపేతానికి నేను పనిచేసుకుంటూ వచ్చానని కన్నా తెలిపారు. పార్టీలో నా సేవలను గుర్తించి బీజేపీ అధిష్టానం 2019 ఎన్నికలకు పది మాసాల ముందు ఏపీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిందని, తనకు అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేసేందుకు నాశక్తి మేర కృషి చేశానని తెలిపారు. ఎన్నికల తరువాత మోదీ నాయకత్వంలో ఏపీలో 2024 ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా పనిచేయటం మొదలు పెట్టానని తెలిపారు. ఈ క్రమంలో అనేక మంది ఇతర పార్టీల్లోని మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు  బీజేపీలో చేరారని గుర్తుచేశారు. అమరావతి ఉద్యమం నుంచి, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేఖ విధానాలపై పోరాటం చేయటం జరిగిందని అన్నారు. కొంతకాలం క్రితం తన స్థానంలో ఏపీ పార్టీ అధ్యక్షులుగా సోమువీర్రాజును అధిష్టానం నియమించిందని, అప్పటి నుంచి సోము వీర్రాజు నాయకత్వంలో పార్టీ నిబంధనలకు అనుగుణంగా పార్టీ బలోపేతానికి పనిచేస్తూ వచ్చానని లక్ష్మీనారాయణ తెలిపారు. కానీ ఇటీవలి కాలంలో పార్టీ పరిస్థితులకు తాను ఇమడలేక పోతున్నానని అన్నారు.

AP BJP On Pawan Kalyan : పవన్ కల్యాణ్ పొత్తుల వ్యాఖ్యలపై ఏపీ బీజేపీలో రచ్చ.. నేతల తలో మాట

సోము వీర్రాజు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పార్టీలో పరిస్థితులు బాగాలేదని, ఆ పార్టీలో పరిస్థితులకు ఇమడలేక రాజీనామాచేస్తున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ  స్పష్టం చేశారు. భవిష్యత్ ప్రణాళికను తన అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు