Kanna Lakshmi Narayana : అమరావతి రైతుల యాత్రకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత- కన్నా లక్ష్మీనారాయణ

అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకుంటామని మంత్రుల మాట్లాడటం దారుణం అన్నారు బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ. అమరావతి రైతుల యాత్రకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

Kanna Lakshmi Narayana : అమరావతి రైతుల యాత్రకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత- కన్నా లక్ష్మీనారాయణ

Kanna Lakshmi Narayana : అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకుంటామని మంత్రుల మాట్లాడటం దారుణం అన్నారు బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ. అమరావతి రైతుల యాత్రకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. తమ సిద్ధాంతం ఉత్తరాంధ్ర అభివృద్ధి కానీ, ఉత్తరాంధ్రను దోచుకోవడం కాదని చెప్పారు. అమరావతి రైతుల పాదయాత్రకు బీజేపీ పూర్తి మద్దతు ఇస్తోందని కన్నా లక్ష్మీనారాయణ తెలియజేశారు.

సీఎం జగన్‌పై కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర సంపదను దోచుకున్న వ్యక్తి జగన్ అని ఆరోపించారు. రాష్ట్ర సంపద మొత్తం దోచేయాలన్న ఆలోచన మానుకోవాలని అన్నారు. దేశంలోనే అంత్యంత ధనవంతుడు కావాలనేది జగన్ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో జగన్ సర్కారే లిక్కర్ వ్యాపారం చేస్తోందన్నారు. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు రోడ్డునపడే పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా నిరుద్యోగులకు మోసం చేశారని మండిపడ్డారు. మూడున్నరేళ్లైనా పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదన్నారు.

రాష్ట్రంలో ప్రజలు బతకలేని పరిస్థితి ఉందని కన్నా వాపోయారు. మాయమాటలతో ప్రజలను ఎంతకాలం మభ్యపెడతారని ప్రశ్నించారు. చెత్తపై కూడా పన్నలు వేసి దోచుకోవడం మంచి పద్దతా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా పెరిగిందని ఆరోపించారు. అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం తప్పనిసరి అని అన్నారు. మూడున్నరేళ్లలో ఉత్తరాంధ్రను ప్రభుత్వం అభివృద్ది చేయలేదని అన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఉంటే.. రాష్ట్రం వేగంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పారు కన్నా లక్ష్మీనారాయణ.

మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. పాలనపై వైసీపీ సర్కార్ కు అవగాహన లేదన్నారు. కేంద్ర పథకాలను వైసీపీ సర్కార్ క్షేత్రస్థాయికి వెళ్లనివ్వడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక కొరతతో కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ మాఫియాలు చెలరేగిపోతున్నాయని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బంగారం సులభంగా దొరుకుతున్నా ఇసుక మాత్రం దొరకడం లేదని ఆయన విమర్శించారు.

”జగన్ పాలనలో ప్రజలు బతకలేని పరిస్థితి ఉంది. ఆయన అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించాలి. ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్.. ఇప్పుడు మోసం చేస్తున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఉంటే అభివృద్ధి వేగంగా జరుగుతుంది. జగన్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం దురదృష్టకరం. పోలవరం ప్రాజెక్ట్ నిర్మించడం చేతకాకపోతే తప్పుకోవాలి. మేమే ప్రాజెక్టును నిర్మిస్తాం” అని కన్నా చెప్పారు.