Girl Attacked Father : విశాఖలో తండ్రిపై బాలిక కత్తితో దాడి కేసులో కీలక మలుపు

విశాఖలో తండ్రిపై బాలిక కత్తితో దాడి చేసిన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రియుడు, అతడి తల్లి చెప్పడంతోనే తన తండ్రిపై దాడి చేశానని బాలిక పోలీసులకు చెప్పారు.

Girl Attacked Father : విశాఖలో తండ్రిపై బాలిక కత్తితో దాడి కేసులో కీలక మలుపు

Visakhapatnam

Updated On : January 23, 2023 / 3:16 PM IST

Girl Attacked Father : విశాఖలో తండ్రిపై బాలిక కత్తితో దాడి చేసిన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రియుడు, అతడి తల్లి చెప్పడంతోనే తన తండ్రిపై దాడి చేశానని బాలిక పోలీసులకు చెప్పారు. తమ బంగారం, డబ్బు ఇప్పించాలని ప్రియుడు, అతని తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు పోలీసులే న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. అక్కాయపాలెం శంకరమఠం ప్రాంతానికి చెందిన బాలికకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది.

వీరిద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని ఆ యువకుడు బాలికను నమ్మించాడు. ప్రియుడి మోజులో పడిన బాలిక తన ఇంట్లో ఉన్న రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలను ఆ యువకుడికి ఇచ్చింది. ఈ విషయం తెలుుసుకున్న బాలిక తండ్రి.. కూతురును నిలదీశాడు. ఇదే విషయంపై ఇంట్లో కొద్ది రోజులుగా ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి.

Girl Attacked Father : ప్రియుడి మాయలో పడి తండ్రిపై కత్తితో దాడి చేసిన బాలిక

ప్రియుడికి ఇచ్చానని చెప్పడంతో బాలిక తండ్రి.. యువకుడికి ఫోన్ చేసి డబ్బులు, నగలు అడగడం ప్రారంభించాడు. దీంతో ప్రియుడు తను ప్రేమించిన అమ్మాయి తండ్రిపై దాడి చేసేందుకు ప్లాన్ చేశాడు. దానికి బాలికనే పావుగా వాడుకున్నాడు. ప్రియుడు చెప్పిన మాటలు నమ్మి కన్న తండ్రిపైనే బాలిక కత్తితో దాడి చేశారు.

అయితే తనపై ఒత్తిడి తీసుకొచ్చి, దాడి చేసే విధంగా చేశారని బాలిక పోలీసులకు తెలిపారు. దీంతో ప్రియుడు, అతని తల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. యువకుడు బాలికలతో ప్రేమ పేరుతో మోసగించడం అలవాటుగా చేసున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.