Polavaram Diaphragm Wall : పోలవరం ప్రాజెక్ట్ లో కీలక పరిణామం.. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభం..
ఈ నిర్మాణ పనులు ఏడాది చివరి నాటికి పూర్తయ్యేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

Polavaram Diaphragm Wall : ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలవరంలో ప్రధానంగా ఉన్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పనులు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఉదయం 10గంటల 23 నిమిషాలకు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను ప్రారంభించారు. టీ-5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో డి వాల్ ను నిర్మిస్తున్నాయి భావర్ అండ్ మేఘా ఇంజినీరింగ్, ఎల్ అండ్ టీ కంపెనీలు.
సీఈ నరసింహమూర్తి పర్యవేక్షణలో సాగుతున్న ఈ నిర్మాణ పనులు ఏడాది చివరి నాటికి పూర్తయ్యేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. డి వాల్ నిర్మాణం పూర్తయ్యాక ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలకమైన డయాఫ్రమ్ వాల్ ను ఒకటిన్నర మీటర్ల మందంతో నిర్మించేందుకు కేంద్ర జల సంఘం ఆమోదం తెలపడంతో అడ్డంకులు తొలగిపోయాయి.
Also Read : మొన్న బెదిరింపు కాల్, నిన్న నకిలీ పోలీస్, ఇప్పుడు డ్రోన్.. పవన్ కల్యాణ్ చుట్టూ అసలేం జరుగుతోంది?
రాష్ట్ర జలవనరుల శాఖ, ప్రధాన కాంట్రాక్టర్ మేఘా, సబ్ కాంట్రాక్టర్ సంస్థ భావర్ రూపొందించిన డిజైన్ కే సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది. నిర్మాణ పనుల్లో ఏవైనా సమస్యలు వస్తే వాటికి రాష్ట్ర జలవనరుల శాఖతో పాటు కాంట్రాక్టర్ సంస్థలు బాధ్యత వహించాలని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది.
డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సీడబ్ల్యూసీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రాజెక్ట్ పనులకు ప్రధాన అడ్డంకి తొలగిపోయినట్లైంది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అవసరమైన మెటీరియల్, యంత్రాలు, నిపుణులను ఇప్పటికే కాంట్రాక్ట్ సంస్థ భావర్ సమకూర్చుకుంది.
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను ఇవాళ ప్రారంభించారు. ఈ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. పనులన్నీ ప్రణాళికబద్దంగా జరుగుతాయని చెప్పొచ్చు.
Also Read : సీఐడీ మాజీ చీఫ్ సునీల్ చుట్టూ చక్రవ్యూహం.. అభియోగాలపై విచారణ.. ఆయన అరెస్ట్ ఖాయమా?