Kodali Nani: సీఎం జగన్ దగ్గర ఉండేవి రెండే టీములు – కొడాలి నాని
పార్టీ కోసం.. సీఎం జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తానని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని అన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. ఇచ్చిన మాట నిలబెట్టుకునే జగన్ మార్గంలోనే నడుస్తామని చెప్పారు.

Kodali Nani
Kodali Nani: పార్టీ కోసం.. సీఎం జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తానని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని అన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. ఇచ్చిన మాట నిలబెట్టుకునే జగన్ మార్గంలోనే నడుస్తామని చెప్పారు. ఆయన చెప్పిన టీంలో ఉండి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.
పార్టీలో ఇప్పటికే రెండు టీములు ఏర్పడ్డాయని జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండించారు. ‘సీఎం జగన్ వద్ద ఉండేది రెండు టీములే.. ఒకటి వైఎస్సార్సీపీ. రెండోది ప్రభుత్వం’ అని అన్నారు.
ప్రస్తుతం ఏపీలో పవర్ కట్ చేయాల్సిన దుస్థితి ఏర్పడిందంటే.. దానికి కారణం గత ప్రభుత్వం చేసిన అప్పులేనని వ్యాఖ్యానించారు. ‘ఇష్టమొచ్చినట్లుగా అప్పులు చేసి ఏపీ ప్రజలను నట్టేట ముంచారు’ అని తెలిపారు.
Read Also: రాజీనామా తర్వాత కొడాలి నాని రియాక్షన్
“కొన్ని మీడియా సంస్థలు నంద్యాలలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నాయి. నా కాలి గోరు, వెంట్రుకలు మాత్రమే కాదు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఊడి పడిన వెంట్రుకను కూడా కదపలేరు”
“ఏపీ మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ ఎవరికి ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం జగన్ అదేశాల మేరకు 24 మంది రాజీనామా చేశాం. ఇంకా 48గంటలైనా గడవకముందే ఈ ప్రచారాలేంటి.. గవర్నర్ వద్దకు వెళ్లాక కొత్త మంత్రి మండలిలో పేర్లు బయటకొస్తాయి. ఒకవేళ నా పేరు లేకపోయినా.. పార్టీ కోసం, సీఎం జగన్ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా” అని కొడాలి నాని అన్నారు.