జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరు.. బాలకృష్ణకు కొడాలి నాని కౌంటర్
జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాని నందమూరి బాలకృష్ణ హుకుం జారీచేయడంపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని గట్టి కౌంటర్ ఇచ్చారు.

kodali nani fires on nandamuri balakrishna over Jr NTR flexis controversy
Kodali Nani: హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాలన్న నందమూరి బాలకృష్ణ వీడియో వైరల్ అయింది. దీనిపై గుడివాడ ఎమ్మెల్యే, ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. గుడివాడలో ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన తర్వాత కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. తన అల్లుడు నారా లోకేశ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు బాలయ్య తొలగిస్తున్నారని అన్నారు. గతంలో పెద్ద ఎన్టీఆరును దించిన బాలయ్య.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల మీద పడ్డారని వ్యాఖ్యానించారు. బాలయ్య లాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరని దీమా వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడం నీచమైన చర్యగా వర్ణించారు. చంద్రబాబు, బాలకృష్ణ లాంటి వారు వెయ్యిమంది వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏమీ చేయలేరని అన్నారు.
చంద్రబాబుకు సెంట్రల్ జైలు ఆహ్వానం
”దుర్మార్గుడి చేతిలో ఎన్టీఆర్ మోసపోయారు. పెద్ద ఎన్టీఆర్ మానసిక వేదనతో చనిపోయారు. ఎన్టీఆర్ పనికి రాడన్న గజ దొంగ చంద్రబాబు. ఆ చంద్రబాబే ఇప్పుడు ఎన్టీఆర్ బూట్లు నాకుతున్నారు. చంపిన వ్యక్తులే ఎన్టీఆరును పొగుడుతూ కీర్తిస్తున్నారు.టీడీపీ నేతలు ఓట్ల కోసం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు చేపడుతున్నారు. చంద్రబాబు రా కదిలి రా అంటే రాజమండ్రి సెంట్రల్ జైలు చంద్రబాబుకు ఆహ్వానం పలుకుతుంద”ని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
పనికి రాని వాళ్లనే సీఎం జగన్ పక్కన పెట్టారు
తమ పార్టీలో అభ్యర్థుల మార్పుపై జరుగుతున్న కసరత్తుపై మాట్లాడుతూ.. పనికి రాని వాళ్లనే సీఎం జగన్ పక్కన పెట్టారని అన్నారు. ”జగన్ ఎవరినైతే పక్కన పెట్టారో.. వాళ్లే టీడీపీకి వెళ్తున్నారు. ప్రతిసారీ అదే నేతలకు టిక్కెట్లివ్వాలా..? పార్దసారధిని జగన్ పక్కన పెట్టారు.. మేమేళ్లి పార్టీలో ఉండమని కోరాం. ఇన్నాళ్లూ కలిసి పని చేశాం.. ఇప్పుడెందుకు పార్టీని వీడడమని పార్దసారధిని అడిగాం. మార్పులు చేర్పులు అధినేత ఇష్టం. టీడీపీలో మాత్రం ఎంత మందిని మార్చలేదు..? చంద్రగిరి నుంచి కుప్పానికి చంద్రబాబు వెళ్లలేదా.. మంగళగిరిలో చిన్నప్పటి నుంచి లోకేష్ ఏమైనా గోళీలు ఆడాడా..? గుడివాడలో నా మీద ఇప్పటి వరకు నలుగురు మారారు.. దీనికేం సమాధానం చెబుతార”ని ప్రశ్నించారు.
Also Read: ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు.. మండిపడుతున్న ఫ్యాన్స్