Guntur Crime
Guntur Crime : గుంటూరు జిల్లా విషాదం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో సంద్యస్నానానికి వెళ్లిన ఐదుగురు వేదపాఠశాల విద్యార్థులు, వారి గురువు ప్రమాదవశాత్తు మృతి చెందారు. అచ్చంపేట మాదిపాడు సమీపంలో కృష్ణా నది ఒడ్డున ఈ విషాద ఘటన చోటుచేసుకుంది శ్వేత శృంగాచలం వేదపాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు, గురువు సుబ్రహ్మణ్య శర్మతో కలిసి కృష్ణా నది స్నానానికి వెళ్లారు. ఐదుగురు విద్యార్థులు గురువుతో కలిసి నదిలోకి దిగారు. మరో ఇద్దరు విద్యార్థులు గట్టుపైనే ఉన్నారు.
చదవండి : Krishna River : కృష్ణానదిలో స్నానానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు, ఉపాధ్యాయుడు గల్లంతు
స్నానం చేస్తున్న సమయంలో ఓ విద్యార్థి ఊబిలోకి జారిపోయాడు. అతడిని కాపాడేందుకు మరోవిద్యార్థి అటుగా వెళ్లడంతో అతడు కూడా అలాగే ఊబిలోకి వెల్లిపోయారు. ఇలా ఒకరివెంట ఒకరు ఆరుగురు ఊబిలోకి వెళ్లి ప్రాణాలు విడిచారు. ఒడ్డున ఉన్న ఇద్దరు విద్యార్థులు కేకలు వేయడంతో జాలర్లు వచ్చి వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటీకే వారు మృతి చెందటంతో మృతదేహాలను వెలికితీశారు. స్నానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమితం గుంటూరు జీజీహెచ్ కి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
చదవండి :
మృతులు : Guntur : గుంటూరు జిల్లాలో మాజీ జవాన్ కాల్పులు..ఒకరు మృతి
సుబ్రహ్మణ్య శర్మ (24) నరసారావుపేట
విద్యార్థులు : హర్షత్ శుక్లా (16), శుభం త్రివేది (17), నితీష్ కుమార్ దీక్షిత్ (15) ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి జిల్లా కాగా, అన్షుమన్ శుక్లా (14) సీతాపూర్ జిల్లా శివశర్మ (14) మధ్యప్రదేశ్ లోని దాహార్ జిల్లా బమోరిఘాట్‌కి చెందినవారు. వీరి మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. వేద పాఠశాల విద్యార్థులు తమ మిత్రులను కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్నారు.
ఇక పోస్టుమార్టం అనంతరం వారి మృతదేహాలను స్వస్థలాలకు పంపించనున్నారు. చదువు కోసం వచ్చి ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేస్తుంది. అయితే గతంలో కూడా ఈ వేదపాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు కృష్ణా నదిలో స్నానానికి వెళ్లి మృతి చెందారు. దీంతో వేదపాఠశాల నిర్వాహకులు అప్పటి నుంచి విద్యార్థులను నదివైపు అనుమతించడం లేదు.
చదవండి : Guntur : అందరూ చూస్తుండగానే రమ్యను పది సార్లు పొడిచాడు, చూస్తూ ఊరుకున్న జనం