Krishna River : కృష్ణానదిలో స్నానానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు, ఉపాధ్యాయుడు గల్లంతు

గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడులో విషాదం నెలకొంది. కృష్ణానదిలో స్నానానికి దిగి ఆరుగురు విద్యార్థులు, ఉపాధ్యాయుడు గల్లంతయ్యారు.

Krishna River : కృష్ణానదిలో స్నానానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు, ఉపాధ్యాయుడు గల్లంతు

Krishna River

Updated On : December 10, 2021 / 8:05 PM IST

Six students and a teacher drowned : గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడులో విషాదం నెలకొంది. కృష్ణానదిలో ఆరుగురు విద్యార్థులు, ఉపాధ్యాయుడు గల్లంతయ్యారు. నదిలో స్నానానికి దిగిన వారంతా గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన వారు మాదిపాడు వేదపాఠశాల విద్యార్థులుగా గుర్తించారు.

మాదిపాడులోని వేదపాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు స్నానం చేసేందుకు కృష్ణానదిలోకి దిగారు. నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు వారంతా గల్లంతయ్యారు. ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను స్థానికులు వెలికితీశారు. మిగిలిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.