Guntur : గుంటూరు జిల్లాలో మాజీ జవాన్ కాల్పులు..ఒకరు మృతి

గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం రేపాయి. మాచర్ల మండలంలోని రాయవరంలో మాజీ జవాన్ కాల్పులు జరుపడంతో ఒకరు మృతి చెందారు. పొలం వివాదంతో ప్రత్యర్థి వర్గంపై సాంబశివరావు కాల్పులు జరిపాడు.

Guntur : గుంటూరు జిల్లాలో మాజీ జవాన్ కాల్పులు..ఒకరు మృతి

Firing

Ex-jawan fired : గుంటూరు జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి. మాచర్ల మండలంలోని రాయవరంలో మాజీ జవాన్ కాల్పులు జరుపడంతో ఒకరు మృతి చెందారు. పొలం వివాదంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ప్రత్యర్థి వర్గంపై మాజీ జవాన్ మట్టా సాంబ శివరావు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో మట్టా శివ మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

ఇరు కుటుంబాల మధ్య కొంతకాలంగా పొలం వివాదం నడుస్తోంది. మట్టా సాంబశివ ఆర్మీలో పని చేస్తుండేవాడు. నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో మట్టా శివ మృతి చెందాడు. ఆంజనేయులు, బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స కోసం మాచర్ల ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

గత కొంతకాలంగా గుంటూరు జిల్లాలో ఆస్తి తగాదాల నేపథ్యంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న సత్తెనపల్లిలో ఆస్తి తగాదాల నేపథ్యంలో తల్లీకూతుళ్లను హత్య చేశారు. తాజాగా రాయవరంలో కాల్పులు ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.