Saikrishna Murder Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక పరిణామం.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు
విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ మృతి(Saikrishna Murder Case) కేసులో తాజాగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
Krishnalanka police station constables surrendered in Saikrishna lock-up death case.
-
సాయికృష్ణ కేసులో హెడ్కానిస్టేబుళ్ల లొంగుబాటు.
-
మాజీ సీఐ నాగరాజుకు సహకారం.
-
వేగవంతం కానున్న సిట్ దర్యాప్తు.
Saikrishna Murder Case: విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ మృతి(Saikrishna Murder Case) కేసులో తాజాగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ హెడ్కానిస్టేబుళ్లు బి. అశోక్ బాబు, పి. నాని సోమవారం సూర్యారావుపేట ఏసీపీ కార్యాలయానికి వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయారు.
Market Crash: స్విగ్గీ, జొమాటోలకు భారీ షాక్.. రూ.1.41 లక్షల కోట్ల లాస్.. అసలు ఏం జరిగిందంటే?
సాయికృష్ణ మృతి వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణలంక మాజీ సీఐ ఎం.వి. నాగరాజుకు వీరిద్దరూ పూర్తి స్థాయిలో సహకరించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) గుర్తించింది. ఈ క్రమంలోనే సీఐ నాగరాజును పోలీసులు అరెస్టు చేసినప్పటి నుంచి ఈ ఇద్దరు హెడ్కానిస్టేబుళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
పోలీసులు వీరి కోసం ముమ్మరంగా గాలిస్తున్న నేపథ్యంలో, ఎట్టకేలకు అశోక్, నాని ఇద్దరూ స్వయంగా వచ్చి లొంగిపోవాల్సి వచ్చింది. వీరి లొంగుబాటుతో ఈ కేసు దర్యాప్తు మరింత వేగవంతం కానుందని, సాయికృష్ణ మృతి వెనుక ఉన్న మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
