ఏపీ 3 రాజధానులు, జగన్ 6 నెలల పాలనపై కేటీఆర్ స్పందన

ఏపీలో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారింది. మూడు రాజధానులు రావొచ్చని సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఈ ప్రతిపాదనపై అమరావతి ప్రాంత వాసుల

  • Published By: veegamteam ,Published On : December 30, 2019 / 03:13 AM IST
ఏపీ 3 రాజధానులు, జగన్ 6 నెలల పాలనపై కేటీఆర్ స్పందన

Updated On : December 30, 2019 / 3:13 AM IST

ఏపీలో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారింది. మూడు రాజధానులు రావొచ్చని సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఈ ప్రతిపాదనపై అమరావతి ప్రాంత వాసుల

ఏపీలో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారింది. ఏపీకి మూడు రాజధానులు రావొచ్చని సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఈ ప్రతిపాదనపై అమరావతి ప్రాంత వాసుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు భగ్గుమంటున్నారు. నిరసనలు, ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.

ఈ నేపథ్యంలో ఏపీలో జగన్ 6 నెలల పాలన, మూడు రాజధానుల అంశంపై ట్విటర్‌ వేదికగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఎంతో తెలివిగా, ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. ఆదివారం(డిసెంబర్ 29,2019) ట్విట్టర్‌లో #AskKTR పేరుతో నెటిజన్లతో కేటీఆర్ మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తెలంగాణ, ఏపీలతో పాటు దేశ రాజకీయలు, ఇతరత్రా అంశాలపై నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు కేటీఆర్ జవాబులు ఇచ్చారు. 

ఈ క్రమంలో.. ఏపీలో మూడు రాజధానుల అంశంపై కేటీఆర్ అభిప్రాయాన్ని చెప్పాలని ఓ నెటిజన్ కోరాడు. ‘మీరు తెలంగాణకు చెందిన వారన్న సంగతి ఒక్కక్షణం మర్చిపోండి. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు అంశం మీ అభిప్రాయం ఏంటి? రాజధాని నగరం, హైకోర్టు ఇవేనా అభివృద్ధి అంటే? ఓ భారతీయ పౌరుడిగా సమాధానం చెప్పండి..”అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. కేటీఆర్‌ తెలివిగా సమాధానం ఇచ్చారు. ”అది నిర్ణయించేది నేను కాదు, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు” అని బదులిచ్చారు.

 

ఇక మరో నెటిజన్.. సీఎం జగన్ 6 నెలల పాలనపై మీ స్పందన ఏంటని ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన కేటీఆర్ ‘మంచి ప్రారంభం’ అని చెప్పారు.