Lakshmi Parvati : ఎన్టీఆర్ భార్యగా నన్ను పిలవకపోవడం అన్యాయం.. ఢిల్లీ వెళ్తా.. ప్రధాని, రాష్ట్రపతి, నిర్మలా సీతారామన్‌లను కలుస్తా

జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం ఇచ్చారోలేదో నాకు తెలియదు.. జూనియర్ ఎన్టీఆర్ వస్తే అక్కడ చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్‌ను కలపాలని పురంధేశ్వరి ప్రయత్నం చేసిందని లక్ష్మీపార్వతి అన్నారు.

Lakshmi Parvati : ఎన్టీఆర్ భార్యగా నన్ను పిలవకపోవడం అన్యాయం.. ఢిల్లీ వెళ్తా.. ప్రధాని, రాష్ట్రపతి, నిర్మలా సీతారామన్‌లను కలుస్తా

Lakshmi Parvati

NTR 100 Rupees Coin Release: ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన 100 రూపాయల నాణెం విడుదల కార్యక్రమంకు నాకు ఆహ్వానం ఇవ్వలేదని లక్ష్మీ పార్వతి అన్నారు. తననుకూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని రాష్ట్రపతికి, ప్రధానికి, ఆర్థికమంత్రి‌కి లేఖ రాశానని, ప్రభుత్వమే నిర్వహిస్తే భార్యగా నన్ను పిలవకపోడం తప్పు అన్నారు. ఇన్విటేషన్ చూస్తే ప్రైవేటు ఫంక్షన్‌కి రాష్ట్రపతి గెస్ట్‌గా వెళ్తున్నట్టు ఉదని, ఎన్టీఆర్ భార్యగా నన్ను పిలవకపవడం అన్యాయం అని లక్ష్మీపార్వతి అన్నారు.

NTR 100 Rupees Coin Release: ఎన్టీఆర్ శతజయంతి స్మారక నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఎన్టీఆర్ ప్రాణాలు తీసిన వాళ్లు వారసులా?

ఎన్టీఆర్ ప్రాణాలు తీసిన వాళ్ళు వారసులుగా చలామణి అవుతున్నారు. భార్యగా నాణెం అందుకోడానికి అర్హత నాకే ఉంది.. వీళ్లకు లేదు. ప్రాణాలు తీసిన వాళ్ళు నాణెం విడుదలకు ఎలా వెళ్లారు? అంటూ లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ నన్ను వివాహం చేసుకున్నారో లేదో అయన పిల్లలు సమాధానం చెప్పాలి. నన్ను పిలవకుండా పురంధరేశ్వరి, చంద్రబాబు అడ్డుకున్నారు. ఎన్టీఆర్ భార్యను అని మెడలో ఫోటో పెట్టుకుని తిరగాలా? అంటూ లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. ఎన్టీఆర్‌తో వివాహం అయినట్టు ఫొటోలు, వార్తా కథనాలు ఉన్నాయి. సాక్షాత్తు ఎన్టీఆర్ అనేకసార్లు బహిరంగంగా చెప్పారు. నన్ను పెళ్ళి చేసుకోలేదు.. ఉంచుకున్నారని టీడీపీ ప్రచారం చేస్తుంది. ఎన్టీఆర్ నన్ను ఇల్లీగల్‌గా పెట్టుకున్నారా..? పెళ్లి చేసుకున్నాడా చెప్పాలి అంటూ లక్ష్మీపార్వతి ప్రశ్నించారు.

Jr NTR : ఎన్టీఆర్ నాణెం విడుదల.. ఈ కార్యక్రమానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ హాజరు అవ్వట్లేదు..?

వాళ్లను వదిలిపెట్టను..

ఎన్టీఆర్ యుగ పురుషుడు అంటున్నారు. పెళ్లి చేసుకోకపోతే యుగ పురుషుడు అవుతాడా..? ఇంతకాలం ఎన్టీఆర్ కుటుంబంపై అభిమానంతో సైలెంట్‌గా ఉన్నా. ఇకపై ఆ కుటుంబాన్ని వదిలిపెట్టను. చంద్రబాబు, పురంధరేశ్వరి, బాలకృష్ణ అందరినీ బయటకు లాగుతా.. వచ్చే ఎన్నికల తరువాత వీళ్ళు రాజకీయాల్లో ఉండకుండా చేస్తా..
వీళ్ళ గురించి ఎన్టీఆర్ ఏమన్నారో ప్రజలకు వివరిస్తా.. ఎన్నాళ్ళు వీళ్ళ నుండి అవమానాలు పడుతూ ఉండాలి అంటూ లక్ష్మీపార్వతీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పురంధేశ్వరికి నేను ఏం అడ్డంవచ్చాను. అయన కష్టాల్లో ఉంటే పురంధేశ్వరి వచ్చిందా..? నన్నెందుకు చులకన చేస్తున్నారు..? నన్ను చులకన చేస్తే ఎన్టీఆర్‌ను చేసినట్టేనని లక్ష్మీపార్వతి అన్నారు.

NTR 100 Rupees Coin: ఎన్టీఆర్‌ స్మారక నాణెం విడుదల.. ఢిల్లీకి చేరిన చంద్రబాబు, పురంధరేశ్వరి.. ఎవరెవరు పాల్గొంటున్నారంటే

ఆ ఇద్దరు కూతుళ్లు తండ్రికి ద్రోహం చేశారు..

ఎన్టీఆర్‌ను చంద్రబాబు బయటకి వెన్నుపోటు‌కు కారణమైతే.. ఇంటర్నల్‌గా పురంధరేశ్వరి ప్రధాన కారకురాలు అని లక్ష్మీపార్వతి ఆరోపించారు. పురంధేశ్వరిని రాజకీయాల్లోకి వద్దన్నారని ఎన్టీఆర్‌పై కుట్ర చేసింది. తండ్రిపై కోపంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది. మళ్ళీ బావామరదళ్లు ఏకమైపోయారు. నాకంటే ఎక్కువ అవమానానికి పురంధేశ్వరి గురవుతుందంటూ లక్ష్మీపార్వతి హెచ్చరించారు. భువనేశ్వరి, పురంధేశ్వరి ఇద్దరూ తండ్రికి ద్రోహం చేశారు. కేంద్రం భారతరత్న ఇస్తానుఅంటే పురంధేశ్వరి అడ్డుకుంది. కేంద్రమంత్రిగా ఉండి అవినీతి చేసింది పురంధరేశ్వరి. ఈరోజు నుండి పురంధరేశ్వరి‌పై పోరాటం చేస్తా.. చంద్రబాబు, పురంధరేశ్వరి ఇద్దరిని ఇంటికి పంపిస్తా అంటూ లక్ష్మీపార్వతి హెచ్చరించారు.

Nagari YCP : మరోసారి నగరి వైసీపీలో గ్రూప్ విబేధాలు.. మంత్రి రోజా ఫొటో లేకుండా పట్టణంలో ఫ్లెక్సీలు

చంద్రబాబు స్ర్కిప్ట్ పురంధేశ్వరి చదువుతుంది..

జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం ఇచ్చారోలేదో నాకు తెలీదని లక్ష్మీపార్వతి అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే అక్కడ చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్‌ను కలపాలని పురంధేశ్వరి ప్రయత్నం చేసింది. బీజేపీ అధ్యక్షురాలుగా ఉంటూ ఆమె టీడీపీకి పని చేస్తుంది. బీజేపీకి ద్రోహం చేస్తుంది. పురందేశ్వరి కుట్రను బీజేపీ తెలుసుకోవాలి అంటూ లక్ష్మీపార్వతి సూచించారు. చంద్రబాబు స్క్రిప్ట్ పురంధేశ్వరి చదువుతుంది.. పురంధేశ్వరి టీడీపి ఏజెంట్ అంటూ లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఢిల్లీ వెళ్తాను.. ప్రధాని, రాష్ట్రపతి, నిర్మలా సీతారామన్‌లను కలుస్తా. నేను రాసిన లేఖలకు సమాధానం రాలేదని లక్ష్మీపార్వతి అన్నారు. ప్రభుత్వ ఇన్విటేషన్ అయితే జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యేవారు. ప్రైవేటు ఫంక్షన్ కనుకే జూనియర్ ఎన్టీఆర్ హాజరుకాలేదని లక్ష్మీపార్వతి అన్నారు.